1994 తొలి కెరటం
మనుషులు వెనక్కి నడవటం కష్టం. కానీ ఒకసారి నడిస్తేనే కదా.. ఆ దారి ఎంత అందమైనదో తెలిసేది. అందుకే తమ పెళ్లిరోజు నాటి మెమొరబుల్ మూమెంట్స్ని మళ్లీ రీ- క్రియేట్ చేయాలనుకుంది ఓ జంట. బంగాళాఖాతం, విహారిపట్నం తీరంలో "ఆక్వాస్టార్' అనే టూరిస్ట్ట్లో గ్రాండ్గా సెలబ్రేషన్ జరుగుతోంది.
"నువ్వూ అదే చొక్కా వేసుకోవాల్సింది" అంది సరోజిని.
"పెళ్ళై ఇరవైయ్యేళ్లు దాటింది. అదిప్పుడు పట్టదు కదా బుజ్జమ్మా” అన్నాడు ప్రొఫెసర్ విన్సెంట్...
"అయితే నువ్వు ముసలోడివి అయిపోయావన్నమాట.." ప్రొఫెసర్ చెవిలో నవ్వుతూ
వెటకారమాడింది.
మొగుడి మీద సెటైర్..! విమెన్ ఎంపవర్మెంట్కి నికార్సైన రుజువు. ఆమెవైపు చూశాడు. ఇరవైయ్యేళ్ల నాటి పెళ్ళి చీరే కట్టుకుందావిడ.
"కొత్త పెళ్ళి కూతురమ్మా, ఓ కోయిలమ్మా.. అని మన పెళ్ళిలో పాట పాడారు. గుర్తుందా..? ఇంకా అదే కొత్తదనంతో కనిపిస్తున్నావు బుజ్జమ్మా" అన్నాడు విన్సెంట్.
పెళ్లినాటి చీరలో ఉన్న సరోజిని సిగ్గుతో నవ్వుకుంది. చీర పాతదైనా అక్కడున్న వారందర్నీ ఆకర్షించింది. నీళ్ల మీద పడ్డ వెలుతురు రిఫ్లెక్ట్ అయి తన చీర మీద పడి మెరుస్తుంటే కొత్త పెళ్లి కూతురిలా మురిసిపోయింది. ప్రొఫెసర్ ఎప్పటిలాగే తన ఫ్రెంచ్ గడ్డాన్ని సవరిస్తూ, కళ్లజోడులో నుంచి అందర్నీ గమనిస్తున్నాడు.
పాస్టర్. దంపతులిద్దరినీ ఆశీర్వదిస్తూ.. చేయి పైకెత్తి...
"So they are no longer two, but one flesh. Therefore what God has joined together, let no one separate" అన్నాడు.
గెస్ట్లు, స్టూడెంట్లు కేరింతలు కొడుతుండగా ఆ దంపతులిద్దరూ మళ్లీ రింగ్స్ మార్చుకున్నారు. అక్కడున్న వాళ్లంతా వైన్ తాగుతూ చిల్ అవుతుంటే.. "ఇక్కడ జరిగే తతంగంతో నాకసలు సంబంధమే లేదు' అన్నట్లు హరిత దూరంగా నిలబడింది. తన ఎర్రటి కళ్ళల్లో నుంచి పొంగుకొస్తున్న కన్నీరు... సముద్రంలోని.....................