ప్రియా...! నా పేరు మృత్యువు
వాచ్ ఒకసారి చూసుకున్నాడు కిషన్. రాత్రి పన్నెండు గంటలు దాటి పది నిమిషాలయింది. ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకు మంటున్నాయి. హైరైజ్ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ మీద పారాపెట్ ఎడ్జ్ చిన్న చెక్కపెట్టె మీద కూర్చున్నాడతను. క్రింద రోడ్ మీద వాహనాల సందడి చాలావరకూ తగ్గిపోయింది. రోడికి అవతల ప్రక్కన కనబడుతోంది హెూటల్ గ్రాండ్!
కిషన్ కూర్చున్న ఏంగిల్ నుండి దాని ఏడవ ఫ్లోర్లోని కార్నర్ గది కనబడుతూ వుంది. ఆ గది విండోలో నుండి గదిలోపలి భాగం స్పష్టంగా స్నయిపర్ టెలిస్కోప్ నుండి కనబడుతోంది!
కిషన్ చాలా జాగ్రత్తగా పిట్టగోడని ఆనించి ఒక వేస్ట్ డ్రమ్ సపోర్ట్ ఎయిమ్ చేసి వుంచాడు స్నయిపర్ని. అతను కూర్చున్న చెక్కపెట్టె హైట్కి కరెక్ట్ గా టెలిస్కోప్ అతని కంటే ఎత్తుకి వుండటంతో కంఫర్టబుల్గా వుందతని పోశ్చర్!
దాదాపూగా గంట నుండి ఆ బిల్డింగ్ టాప్ మీద వెయిట్ చేస్తున్నాడతను. నిజానికి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లో అన్ని ఫ్లోర్లలోనూ రకరకాల ఆఫీస్ లు వున్నాయి. చాలా ఆఫీస్ లు 6 గంటలకి, మరికొన్ని ఎనిమిది గంటలకి క్లోజ్ అయిపోయాయి. బిల్డింగ్ ముందు పేరుకి గార్డ్ చేస్తూ వాచ్మెన్ ఒక్కడే వున్నాడు.
బిల్డింగ్ ప్రక్కనే ఫైర్ ఎస్కేప్ కోసం ఐరన్ పైప్స్ మెట్లు బిల్డింగ్ గోడకి ఆనించి ఏర్పాటు చేయబడి వుండటంతో పదకొండు గంటలకి నిశ్శబ్దంగా మూడోకంటికి తెలీకుండా బిల్డింగ్ టాప్ మీదకి చేరుకొని వెంట తెచ్చినవన్నీ రడీ చేసుకొని, ఫ్లోర్పైన విడిగా.............