మావిరెమ్మల దాగి...
మావిరెమ్మల దాగి మధురగానమొనరు
కోకిలమ్ములతోడ గొంతుకలిపి
నీలియాకసమందు తేలియాడుచుబోవు
పాలమబ్బులతోడ కేలుకలిపి
క్రొత్తగా వికసించి నెత్తావు లెగజిమ్ము
మల్లెపువ్వులతోడ మనసుకలిపి
కొమ్మకొమ్మను చేరి కొంటెసరసమాడు
కొదమగాలులతోడ పదముకలిపి
మధురభావనావీధుల మసలుచుందు
కాలమంతయు నిట్టులె గడపుచుందు
మనము నెరియించు బాధలు మరుగువడగ
అమృతమయములౌ నీ పదా అందుకొనగ..........