Logili Books

Novels

Priyatama Neevachata Kusalama

By Anugu Srinivas Reddy

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Priyatama Neevachata Kusalama
Publisher
Varnam Publications
ISBN
MANIMN7160
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
122
Language
Telugu
Availability
In Stock
About this book

హైదరాబాద్ నుండి బయల్దేరిన బస్సు, ఉదయం ఆరు గంటలకు నిజామాబాద్ చేరుకుంది. కండక్టర్ సీటులోంచి లేచి వెనక్కి తిరిగి చూశాడు. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. తన చేతిలో ఉన్న టికెట్ పంచ్ని పక్కనే ఉన్న రాడ్ మీద కొడుతూ "దిగాలి దిగాలి... నిజామాబాద్ వచ్చింది..." అన్నాడు గట్టిగా. అందరూ లేచి బ్యాగులు తీసుకుని బస్సు దిగుతూ ఉన్నారు.

కిందకి దిగగానే 'నిజామాబాద్ బస్టాండ్' అనే బోర్డును చూసి కృష్ణమూర్తి మనసు సంతోషంతో నిండిపోయింది.

అలాగే నిలబడి చుట్టూ చూస్తుండగా, వెనకనుంచి ఎవరో అతన్ని తోసుకుంటూ పరిగెత్తాడు. కోపంగా వెనక్కి తిరిగేసరికి, ఇంకో వ్యక్తి కూడా అలానే పరిగెత్తాడు. 'అసలు ఏం జరుగుతోంది?' అనుకుంటుండగా మరో ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ రావడం గమనించి, వెంటనే పక్కకి తప్పుకున్నాడు కృష్ణమూర్తి.

ఏం జరుగుతుందో అర్థంకాక కండక్టర్ దగ్గరికి వెళ్లి “వీళ్లందరూ ఎందుకు పరిగెడుతున్నారు?” అని అడిగాడు.

"ఆర్మూర్ మీదుగా వెళ్ళే బస్సు బయలుదేరుతుందని వెళుతున్నారు. ఇది మిస్ అయితే ఇంకో గంట వరకూ బస్సలు రావు" అన్నాడు కండక్టర్.

"అయ్యయ్యో... నేను కూడా అదే బస్సుకి వెళ్ళాలి" అని, కృష్ణమూర్తి కూడా వాళ్ళతో పరిగెత్తాడు.

డ్రైవర్ బస్సుని రివర్స్ తీసుకుని ఫస్ట్ గేర్ వేయగానే... కృష్ణమూర్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి చప్పున బస్ ఎక్కేశాడు.........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?