సంజ్ఞా పరిచ్ఛేదము
కం. సత్యము శ్రేయము జనులకు;
సత్యము ద క్కొండు లేదు సద్ధర్మ; మదే
యత్యలఘుతపఃఫల మిడు;
నిత్యతఁ బాటిల్లు దాన నిఖిలార్థంబుల్.
జనులకు సత్యమే శ్రేయస్కరం. సత్యాన్ని మించిన గొప్పధర్మం మరొకటిలేదు. గొప్పతపస్సుచేయటంవల్ల కలిగే ఫలితాన్ని సత్యమే ఇస్తుంది. దీని వల్లనే సమస్త ప్రయోజనాలు, చేసినసత్కార్యాలు స్థిరత్వాన్ని పొందుతాయి అని సత్యస్వరూపాన్ని గూర్చి గ్రంథాదిలో కీర్తించాడు.
అఆ ఇఈ ఉ ఊ ఋౠ ఌ ఎఏ ఐఒ ఓఔ అఁ అం అః
కఖ గఘ ఙ చచే ఛజ జే ఝ ఞ టఠ డఢ ణ తథ దధ న పఫ బభ మ య ర ల వ శ ష స హ ళ .
"కారగ్రహణము సంస్కృతప్రాకృతభాషావ్యాకరణజ్ఞుల సమ్మతము. అయ్యది మంత్రశాస్త్ర ప్రసిద్ధము. యవలలవలె రేఫంబును బ్రయత్నభేదంబుచే ద్వివిధంబులుగాన శబ్దశాసనాదులచేత నలఘురేఫము వర్ణాంతరముగా గ్రహింపఁబడదయ్యె. క్షకారము సంస్కృత వ్యాకరణములయందును, నిఘంటువులయందును ప్రాంతపదమధ్యము నందుఁ బఠింపఁబడుటంజేసి యది వర్ణాంతరము గాదు; సంయుక్తాక్షరమని తెలియవలయు....................