సత్య సూక్తి
- - శ్రీ మద్దులపల్లి సత్యనారాయణ శాస్త్రి
ఆంధ్రాధ్యాపకులు, యస్. యస్. యస్. కళాశాల, నరసరావుపేట
"రాతిరీతినీతవసనా ప్రియే శుద్ధాం. పి వాజ్మదేసరసా!
వీసా సాలంకృతిరపి న రోచతే సాలభంజీవ"
ఈ సుధామయోక్తిని యొక సరస హృదయుందు వచించినాఁడు. ఇది త్రికాల బాధ్యమైన సత్యసూక్తి, హృదయ శూన్యమగు యాకృతి కెన్ని భూషణములున్నను నవి భీషణములే, సరస హృదయ యగు లేజవ్వని కయ్యవి విభూషణములై విశేష విచ్ఛిత్తిని చేకూర్చును. ప్రణయరస నిర్భరయగు కాంత రతివేళల భూషణ హీనయయ్యు నైజములగు హావభావ విలాసముల చేతనే ప్రియునలరింపఁ జాలును. విరసయగు కాంత బహుభూషణముల భూషితయయ్యు ప్రియ హృదయము ప్రణయ డోలికల తెమల్పఁ జాలదు. అట్లే రసవత్కావ్యము సహృదయ హృదయానందము చేకూర్పఁ జాలును. పైపెచ్చు రసనిర్భరకు నిరాభరణతయే విశేష సౌందర్య సంధాయక మనుట నిర్వివాదము. ఈ దృష్టితోడనే యొక మహాకవి "..కుంకుమ కలంకితోజ్వల కపోల ముత్ప్రేక్షతే నిరాధరణ సుందర శ్రవణపాశముగ్ధం ముఖమ్" అని నిసర్గ సౌందర్య మాధురిని సూచించినాఁడు.................