బోధకుడు, న్యాయవాది, రాజకీయవేత్త,
శాస్త్రవేత్త మీ మనసులోకి చొరబడతారు
మార్పుతోనే ప్రగతి సాధ్యమయ్యేది, మానసికంగా అందుకు సిద్ధపడని వారు ఎప్పటికీ దాన్ని అందుకోలేరు.
-జార్జి బెర్నార్డు షా
ఆయన పేరుతో మీకు అంతగా పరిచయం ఉండకపోవచ్చు గానీ, మైక్ లాజర్డిస్ మీ జీవితంపైన ఎంతో కొంత ప్రభావం చూపి ఉంటారనటంలో ఎలాంటి సందేహం లేదు. బాల్యం నుంచి అతను ఎలక్ట్రానిక్ రంగంలో తనదైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించాడు. నాలుగేళ్ల వయసు వచ్చేటప్పటికే, లెగోలు, రబ్బరు బ్యాండులతో తన కోసం రికార్డు ప్లేయరుని తయారు చేసుకున్నాడు. హైస్కూలులో ఉండగా, టీవీలు పాడయితే వాటిని బాగు చేయటానికి టీచర్లు అతని సాయం అర్థించేవాళ్లు. ఖాళీ సమయాల్లో అతను కంప్యూటర్ రూపొందించాడు. అలాగే హైస్కూలు క్విజ్-బౌల్ టీమ్ కి బజ్జర్ తయారు చేశాడు. ఇదంతా అతను కాలేజీలో మొదటి సంవత్సరం ఫీజులు చెల్లించటానికి ఉపయోగపడింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తికావటానికి కొద్ది నెలల ముందు అతను తన తరంలోని వ్యాపారవేత్తలమాదిరిగానే అర్థాంతరంగా కాలేజీని వదిలిపెట్టి బయటకొచ్చేశాడు. అదే సమయంలో మైక్ ప్రపంచంపైన తన ముద్ర వేయటానికి అడుగులు పడ్డాయి.
చలనచిత్రాలు ఫిల్ములో బార్ కోడ్ అధ్యయనంపైన అతను ప్రత్యేక హక్కు (పేటెంట్) దక్కించుకుని తొలివిజయం నమోదు చేసుకున్నాడు. హాలివుడ్ లో అది అత్యంత ప్రయోజనకరమైనది. సాంకేతికరంగంలో ఈ విజయానికి ప్రతిష్టాత్మకమైన ఎమ్మీ, ఆస్కార్ వంటి అవార్డులు లభించాయి. తర్వాత అతని కంపెనీ సాధించిన విజయంతో పోలిస్తే ఇదేమంత చెప్పుకోదగ్గ విషయం కాదు. అతని తదుపరి................