పునర్భవ దోషము
పునర్భవ దోషమనగా: (చంద్రకళ క్షీణించుట)
దోష కారకులు శని మరియు చంద్రుడు
ఈ పునర్భుదోషంనకు మూలకారకుడు “శని”. భచక్రంనందు 4వ మరియు 5వ స్థానములు చంద్రుడు మరియు రవికి స్వక్షేత్రములు. భచక్రం నుండి మకర కుంభరాశులు శని స్వక్షేత్రాలు. అనగా మకరం కర్మస్థానముగా, కుంభం కార్యఫలసిద్ధి స్థానంగా సూచిస్తాయి. అయితే ఈ స్థానములకు అధిపతి అయిన "శని" రవి, చంద్రులకు సమసప్తమాధిపతి అవుతాడు. ముఖ్యముగా చంద్రుడు, | శని నక్షత్రంలో ఉన్న లేక సబ్లో ఉన్నా లేక శని, చంద్రుని నక్షత్రంలోగాని లేక సబ్లో యున్నట్లయితే చంద్రుడు తన సహజశక్తిని కోల్పోవును. (అనగా రాక్షసులు రాత్రి సమయం నందు సంచరించునట్లుగా చంద్రుడు కౄరస్వభావిఅయి తన సహజ స్వభావమును కోల్పోవును) ఇట్టి సహజదోషం 3వ లేక 10వ మరియు 17వ దృష్టి వలన చంద్రునకు సంభవించును.
పూర్వకాలంనందు మన భారతీయ జ్యోతిష ఫలశాస్త్రముయందు వారు అనేక యోగములు గూర్చి వివరించియున్నారు. వారిలో కొందరు జాతకాలు | వారి వారి జీవన స్రవంతిలో ఉన్నతస్థాయి మొదలు నిర్భాగ్యపు స్థాయి వరకు సవిచూచిన వారిని గూర్చి వారిలో కొందరికి పూర్వపుణ్య ఫలముగా రాజ యోగులుగా, మరికొందరికి పూర్వకర్మ- అవయోగులుగా వారి వారి జీవన మనుగడను గుర్తించారు.
అవ యోగములకు కొన్ని సూత్రాలను సూచించారు. వాటిలో కుజదోషం, కాలసర్పదోషం, కళత్రదోషం, పావకర్తరి దోషం మొదలగు వాటిని అవయోగములుగా, బహుకాలముగా మన పురాతన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే ఈనాటి కాలములో వారు సూచించిన రాజయోగములుగాని లేక అవయోగములుగాని, కె.పి. సిద్ధాంతమును అనుసరించేవారు మాత్రం పై యోగములకు ప్రాముఖ్యత ఇవ్వరు. ముఖ్యముగా ఈనాటి కాలంలో వివాహ..........