పూర్ణిమ
"నేను ఇండియా కెళదామనుకుంటున్నాను అన్నయ్య"
చదువుతున్న పుస్తకం మూసి సూటిగా సహజను చూశాడు మూర్తి.
"ఏం, లాస్ఏంజిల్స్ నచ్చలేదా నీకు?” నవ్వుతూ అన్నది మిసెస్ మూర్తి.
"ఛా! ఛా! అదికాదు వదినా! రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసేలోపల ఒకసారి ఇండియా వెళ్ళాలనిపించింది."
"ఏది... నీ సోషల్ కండిషన్స్, ఉమెన్ ఆ రీసెర్చ్ కోసరమా? ఇండియాలో నీకు కనబడబోయేది గౌరవం కప్పుకున్న స్లేవరీ, లేకపోతే ఆర్థిక వత్తిడి వల్ల వచ్చిన బానిసత్వం... I don't think you can study real woman there .. any way, నాకు ఆఫీస్ టైం అయింది....బై మూర్తీ... బై సహజా...”.
వెళ్లిపోతున్న ఆమెనే చూస్తున్న మూర్తి చూపులో భావనకు ఉలిక్కిపడింది సహజ... ఏదో వస్తువును చూస్తున్నట్లు చూస్తున్నాడతను.
"అన్నయ్యా!" ఆమె గొంతులో ఏదో హెచ్చరిక.
"ఆ" ఉలిక్కిపడ్డాడు మూర్తి...
"సహజా! నిజంగా నువ్వు నీ రీసెర్చ్ సీరియస్ గా ఉన్నావా? లేకపోతే పెళ్ళయ్యేదాకా కాలక్షేపం అనుకుంటున్నావా?"
'అదేమిటన్నయ్యా! అసలు... నేను..”
ఉప్... ఇప్పుడే వస్తాను..."
సంవత్సరం క్రితం స్టూడెంటుగానే అమెరికా వచ్చింది సహజ... వదిన అంటీ ముట్టనితనం, అన్నయ్య నిస్సహాయత త్వరలో అర్ధమై స్నేహితురాలితో అపార్ట్మెంటులో ఉంటోంది సహజ... వదిన చెడ్డది కాదు, ప్రాక్టికల్ మనిషి.. అలా అర్థం అవడం....................