ఆరంభము
అనంత పరబ్రహ్మ స్వరూపమగు ఈశ్వరుడు కాలస్వరూపుడు కాలము యొక్క అనగా ఈశ్వరునియొక్క స్వరూపము తెలిసికొనువాడే దైవజ్ఞుడు అనబడుచున్నాడు. భూత భవిష్యత్ వర్తమానములు తెలియువారిని కాల జ్ఞులని దై ఎజ్ఞులనియును అనుట నిత్యవ్యవహారమునందు కలదు అట్టి కాలజ్ఞాన మును కలిగిన వత్పురుషులు, మహానుభావులు మనయందు అనేకులు కలరు.
ప్రకృతియందు కనిపించునట్టియు, కనిపించక సూక్ష్మములగు నట్టియు అనేకములగు కిరణసముదాయములు ప్రసరించుచుండును. అట్టి కాంతి ప్రసరణము ఒక నియమముతో ప్రసారితమగుచుండును. అతీంద్రియ పంపన్నులగు మహాపురుషులు ఆకాంతి (జ్యోతులు) పుంజములు ప్రసరణ లపై అనేక సంవత్సరములు శ్రమించి వాటి ఫలితములను కనుగొనియు న్నారు. వారి ఆలోచనలను సూత్ర బద్ధముచేసి తరువాత తరములవారికి అందించియున్నారు. వారు శ్రమించిన సూత్రముల సారమే ఈ జ్యోతిష శాస్త్రము.
ఎవరు ఏ శాస్త్రమును నిర్మించినను కొన్ని నియమములకు లోబడి చేయుచుందురు. శాస్త్ర నిర్మాణమునందు దేశ-కాల-పాత్రలు ప్రాముఖ్యత తప్పక వహించుచుండును. ప్రతి శాస్త్రమునందును కాలక్రమాను గతము లగు మార్పులు చేర్పులును జరుగుచునే యుండును. ఏ శాస్త్రమునందయి జరుగుట నిశ్చయము. మనము ఒక విషయముపై మాట్లాడు అధికారము కావలయుననినచో ఆ విషయముపై మనకు సంపూర్ణ అవగా................