అకంపనుడు 1 : రాక్షసుల్లో గొప్ప వీరుడు. సుమాలి కేతుమతిలకు జన్మించిన వారిలో రెండవవాడు. సీతా పహరణమే రాముని వధకు మార్గమని రావణు నికి సలహా ఇచ్చినవాడు. ఖర, దూషణ, త్రిశురా శులను రామలక్ష్మణులు వధించారని రావణునికి తెలియజేశాడు. హనుమంతునితో తీవ్రంగా పోరాడి అతని చేతుల్లో మరణించాడు.
అకంపనుడు 2 : కృతయుగంలో ఒక రాజు. కుమా రుడు ఓ యుద్ధంలో మరణించగా నిస్పృహ చెందిన వాడు. నారదుడు ఎన్నో కథలు విన్పించి ఇతణ్ణి కార్యో న్ముఖుణ్ణి చేస్తాడు. మహాభారత యుద్ధానంతరం ధర్మ జుడు శోకతప్తుడైనప్పుడు వ్యాసుడు ఇతని కథ చెప్పి ధర్మజుడ్ని ఓదార్చుతాడు. ................మహాభారతం
అకర్కార : కద్రువకు జన్మించిన ఒక నాగు. జన్మవృత్తాంతము : దక్షుణి 8 మంది కుమార్తెలను కశ్యపుడు వివాహమాడగా అందులో ఒకరైన క్రోదవ శశకి 10 మంది జన్మించిరి. ఆ పదిమందిలో కద్రువ ఒకరు. ఆమెకు జన్మించిన ఒక నాగు అకర్కార.
అకూపార : హిమాలయాల్లో వున్న ఇంద్రద్యుమ్న మనే కొలనులో నివసించే తాబేలు. దీనిని ఆది కూర్మమని, దేవుని రెండవ అవతారమని పిలుస్తారు. మరిన్ని వివరాలు మహాభారతంలోని అరణ్యపర్వంలో లభిస్తాయి. అకృతవర్ణ : గొప్ప తపస్వి. పరశురాముని శిష్యుడు. నైమిశారణ్యంలో రుషుల సమావేశంలో మొట్ట మొదట మహాభారత కథను విన్పించిన సూతుడు ఇతని శిష్యుడే............భాగవతం
పూర్వవృత్తాంతము : ఇతడొక బ్రాహ్మణ బాలుడు. అరణ్యములో తపస్సు చేసుకొనుచుండగా శాపవ శమున పులిగా మారిన గంధర్వుని కంటబడి చంప బోవుచుండగా శివుని వద్ద అస్త్రశస్త్రములను పొంది తిరిగివచ్చు పరశురాముని వలన కాపాడ బడినాడు. ఆనాటినుండి అతడు జీవితాంతము పరశురాముని వెంటవుండి జీవించెను. పరశు రామ, భీష్ములకుమధ్య..............................