• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Putrakameshti

Putrakameshti By Dr Gayathri Devi

₹ 80

ఎందుకీ పుత్రకామేష్టి

గర్భధారణ అనుకోకుండానో, యాదృచ్ఛికంగానో జరిగేది కాదు. ఇది త్రికరణ శు ద్ధిగా కోరుకుని, ఒక పవిత్ర యజ్ఞంలా భావించి ఆరంభించవలసిన సృష్టికార్యం అని ఋషుల మాట. షోడశ సంస్కారాలలో మొదటిది గర్భాదానం. సృష్టి కార్యక్రమానికి శ్రీకారం.

పుట్టబోయే బిడ్డ శారీరక, మానసిక ఆరోగ్యానికి మూలాలు తల్లిదండ్రుల కణాలలో ఉన్నాయి. వారి శరీరాలలో, మనసులలో ఉన్నాయి. తమ శారీరక మానసిక ఆరోగ్యాన్ని అత్యంత సూక్ష్మమయిన ప్రత్యుత్పత్తి కణాల ద్వారా వారసత్వ సంపదగా సంతానానికి అందించే క్రియే గర్భాదాన సంస్కారం. తమ పిల్లలు వారి శక్తికి మించి ఏవేవో సాధించెయ్యాలని కలలు కని, వారిపై అలవికాని భారాన్ని మోపడం కాదు. కడుపులో బిడ్డ రూపుదిద్దుకోవడానికి ముందే పుట్టబోయే బుజ్జాయికి శారీరక ఆరోగ్యాన్ని అందించేందుకు తమ శరీరాలనీ, మానసిక బలాన్ని అందించేలా తమ మనసులనీ సంసిద్ధం చేసుకోవాలి. ఆ బుజ్జాయిని ఆనందంగా ఆహ్వానించడానికి సిద్ధం కావాలి. | పుట్టబోయే బుజ్జాయి తల్లి గర్భంలో రూపుదిద్దుకుని ఈ లోకంలోకి అడుగుపెట్టి చక్కగా ఎదిగే వరకూ తీసుకోవలసిన శ్రద్ధే ఈ "పుత్రకామేష్టి".

మీ చేతిలో ఉన్న ఈ పుస్తకం మీ చేత 'పుత్రకామేష్టి' చేయిస్తుంది. సత్సంతానాన్ని కోరుకుంటున్న మీకు చేయూతనిస్తుంది.

  • Title :Putrakameshti
  • Author :Dr Gayathri Devi
  • Publisher :Rushi Peetam Prachurana
  • ISBN :MANIMN4268
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :104
  • Language :Telugu
  • Availability :instock