ముగ్ద మొహనమ కథలు
సాహిత్య ప్రక్రియలన్నింటికెల్లా, కథా ప్రక్రియ బహు ప్రాచీనము మరియు ప్రాచుర్యముగాంచినది. నిన్నటి తరానికి 'కథలు' అనగానే ఆరు బయట వెన్నెల రాత్రుళ్ళలో నానమ్మలు లేదా అమ్మమ్మలు "అనగనగా....” అంటూ రాజకుమారుడు వేటకు వెళ్ళటం, అడవిలో ఓ చక్కని రాజకుమారి రాక్షసుడి బారినపడి గుహలో బంధించబడటం, వీరోచితంగా రాజకుమారుడు రాక్షసునితో పోరాడి, సంహరించి రాజకుమారిని పెళ్ళాడటంతో కథ కంచికి వెళ్ళేది.
తర్వాతి కాలంలో కాశీ మజిలీ కథలు, అరేబియన్ నైట్సు కథలు, సాహసి సిందాబాద్ కథలు పుస్తకాల రూపంలో వచ్చి పఠితులను అలరించేవి.
దిన, వార, మాస పత్రికలు వచ్చి కథల ప్రాముఖ్యత పెరిగింది. జీవన వ్యాపారం ఉరుకుల పరుగుల మయం అయ్యాక నేటి పాఠకులు కథల పైనే మక్కువ చూపుతున్నారు. వీలు దొరికిన 15-20 నిమిషాల్లో చదవటం ముగించగలగటం కథా సాహిత్యం చేకూర్చగలిగే సౌకర్యం.
'సాహిత్యం యొక్క ప్రయోజనం పాఠకుడిని సంస్కార వంతుడిగా చేయటం’ అంటారు గురజాడ. సాహిత్యంలో భాగమైన కథలు. ఆలోచనలని పెంచుతాయి. మంచితనం వేపు నడిపించి సంస్కారవంతుల్ని చేస్తాయి. సమాజాన్ని పురోగతి వేపు తీసుకువెళ్ళుతాయి. కథ జీవితమంత గొప్పది. జీవితమంత విలువైనది. అందమైనది. సాగరమంత విస్త్రుతమైనది, సమాజమంత విశాలమైనది. కథల్లో జీవితం ప్రతిబింబించటం వల్ల పాఠకుడు మమేకమౌతాడు తదాత్మ్యత చెందగలుగుతాడు. ఈ సౌకర్యం వల్ల కావొచ్చు. నేటి రచయితలు కథలు రాయటానికే మొగ్గు చూపుతున్నారు. కథా రచనలో సంక్షిప్తత క్లుప్తత ఉంటుంది. అనవసర సాగదీతలకు ఆస్కారం ఉండదు.
నేటి కథకుల భావ ప్రపంచం ఎల్ల లెరుగక విశాలమై వికసిస్తున్నది. మంచి కథలు రాస్తున్నారు. కథల రాసి, వాసి పెరుగుతున్నది. పత్రికలు సాహిత్య సంస్థలు పోటీలు నిర్వహించి మంచి కథలను అందిస్తున్నారు. కంప్యూటరీకరణ, ముద్రణ.................