• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Rabindranath Tagore Gitanjali

Rabindranath Tagore Gitanjali By Smt P Shanthadevi

₹ 250

గీతాంజలి- ఒక భావాంజలి

గీతాంజలి పేరు పలకగానే మనసులోంచి భక్తి, భావావేశము పొంగి వస్తాయి. అది ఆ గీతాల మహత్యం, రవీంద్రుని భక్తి మహత్యం, గంభీర తాత్విక చింతన మహత్యం. భారతీయ ఆధ్యాత్మిక చింతనా ధోరణికి, భారతీయుల జీవన విధానాన్నీ, చింతనా ధోరణిని నిర్ధారించిన భగవద్గీత ని పోలిన ఆలోచనా ధోరణి ప్రతిబింబించడం తో, వంద సంవత్సరాలైనా, ఈ గీతాలు నిత్య నూతనంగా కనిపిస్తాయి.

ఈ గీతాలన్నీ ఠాగూర్ అప్పుడప్పుడు రాసుకున్నవాటిలోనుంచి ఏరి ఒక వంద పద్యాల గీత మాలికగా గీతాంజలి పేరుతో విడదీసి ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి ప్రచురించారు. వీటిలోని లోతైన తాత్వికతకి, గంభీరమైన అర్థాలకి, లోకం పరవశించింది. ఆసియాలోనే మొట్టమొదటి వ్యక్తిగా నోబెల్ పురస్కారం అందుకున్నారు టాగూర్. విశ్వకవి అయ్యారు. ఈ గీతాలు అన్ని భారతీయ భాషలలోకీ అనువదించబడ్డాయి. తెలుగులోనే కనీసం ఎనభై అనువాదాలున్నాయి. ఛందోబద్ధమైన పద్యాలతో కొంతమంది రాస్తే, అందమైన భావకవితలతో మరి కొంతమంది అనువదించారు. నేను విద్యార్ధి దశ లో ఉండగా చలం గారి అనువాదం లభ్యమయ్యింది. ఆ అనువాదం నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆ తరువాత కొన్ని అనువాదాలు చదివాను కానీ చలం గారి అనువాదానికి చాలవనిపించింది. చాలా సంవత్సరాల తరువాత డా. జె. భాగ్యలక్ష్మి గారి అనువాద కవితలు చదివాను. చలం గారిని గుర్తు చేశారు. అంతే కాక ఆ కవితలలో భావ గంభీరత తో పాటు లాలిత్యం కనిపించింది.

మా ఢిల్లీలో సాహితీ వేదిక అని ఒక సాంస్కృతిక సంస్థ ఉంది. ఔత్సాహిక సాహిత్యకారుల సంఘం అది. మేము ప్రతీ నెలా చేసుకునే సమావేశాల్లో భాగంగా ఒకసారి అనువాద సాహిత్యం లో నచ్చిన పుస్తకం గురించి ప్రసంగించమన్నారు....................

  • Title :Rabindranath Tagore Gitanjali
  • Author :Smt P Shanthadevi
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN4507
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :320
  • Language :Telugu
  • Availability :instock