• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Raghava Pandaveeyamu

Raghava Pandaveeyamu By Vidhwaan Sri Bhashyakaaracharyulu

₹ 500

శ్లో॥ అభిమండలమండితగండతలం
     తిలకీకృతకోమలచంద్రకళమ్ |
     కరఘాతవిదారితవైరిదళం
      ప్రణమామి గణాధిపతిం జటిలమ్ ॥

                - సుభాషితభాండాగారము

శ్రీ చామర్తి పార్థానందప్రసాద్, నేను S.K.V.C.M.Z.P. హైస్కూలు (సంగం జాగర్లమూడిలో ఆటో తరగతి నుంచి పదోతరగతిదాకా కలిసి చదువుకున్నాము. పది తరువాత పార్థు ఆర్ట్స్్స్కలేజీలో చేరి M.Sc. చదివి ఫారెస్ట్ ఆఫీసర్గా ఉద్యోగించి పదవీవిరమణ చేశాడు. నేను సంస్కృతకళాశాలలో చేరి భాషాప్రవీణ చదివి తెలుఁగు M.A. M.Phil. డాక్టరేట్లు వగైరాలవైపు ప్రయాణించి, పాతికేళ్లకు పైగా ప్రైవేటు జూనియర్ కాలేజీలలో సంస్కృతం లెక్చరరుగా పనిచేసి స్వచ్ఛందంగా విరమించి, ప్రస్తుతం బుద్ధిగా సంస్కృతాంధ్రసాహిత్య గ్రంథావలోకనం చేస్తున్నాను. మాపొట్టకూటిదారులు వేచైనా స్నేహమార్గంలోమాత్రం వీలయినప్పుడు కలుసుకుని కుశలప్రశ్నలు వేసుకుంటున్నాము.

మాపార్థు వృత్తిరీత్యా వనచారి అయినా ప్రవృత్తిరీత్యా పఠనశీలి. ఇతనికంటిలో పడి ఎన్నెన్నో నవలలు, చారిత్రక గ్రంథాలు, ఉపనిషత్తులు, వచనరూపభారత భాగవత రామాయణాదులు, తత్వశాస్త్రపుస్తకాలు వగైరాలు నలిగి నలిగి బుద్దిగుహలో పదిలంగా ఉన్నాయి. నేను విశ్వనాథ సత్యనారాయణగారి రామాయణ కల్పవృక్షంతోపాటు కొన్ని నవలలే చదివాను. ఇతను దాదాపు విశ్వనాథగారి నవలలన్నీ చదివాడు. కొన్నయితే రెండుమూడుసారులు కూడా చదివిన శ్రద్ధాళువు మాపారు. పొరపాటునగానీ, అనుకునిగానీ నేను దొరికితే గంటలగంటలు వీటిమీద చర్చలు సాగించి అబ్బురపఱుస్తాడు. లోలోతువిమర్శలతో ఎదుటివ్యక్తికి ఆలోచనాలోచనాలను మఱింత తెఱిపిస్తాడు. ముఖ్యంగా మనసనాతనధర్మవిషయాలను సహేతుకంగా వివరించి విశ్వాసం పెంచుతాడు. దీనికి తోడు సంస్కృతాంధ్రభాషాసాహిత్యాలంటే వల్లమాలిన అభిమానం పార్థునిగుండెలో పీటవేసుకుంది. ఫలితంగా ఈరెండుసాహిత్యాలను తనపరిధిలో కొంత ధనవ్యయంచేసి పుస్తకరూపంలో పోషించాలని దశాబ్దంనుండి నన్ను సంప్రదిస్తున్నాడు. అర్ధశతాబ్దంనుండి సంస్కృతాంధ్రపండితులతో దగ్గఱగా, సంచరించిన నేను నా అనుభవాలను వివరించి తొందరపడవద్దని ఆపుతున్నాను. సంస్కృతాంధ్రశాఖలలోని పెద్దలలో మాగురువులవంటి ధర్మస్వరూపులు విరాళాతివిరళంగా మాత్రమే కనిపించారు............

  • Title :Raghava Pandaveeyamu
  • Author :Vidhwaan Sri Bhashyakaaracharyulu
  • Publisher :Chamarthi Pardhanandaprasad
  • ISBN :MANIMN4975
  • Binding :Hard binding
  • Published Date :2023
  • Number Of Pages :610
  • Language :Telugu
  • Availability :instock