• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Railu Badi

Railu Badi By N Venugopal

₹ 200

రైల్వే స్టేషన్

వాళ్లిద్దరూ ఒయిచి వెళ్లే రైలులోంచి జియునౌకా స్టేషన్లో దిగారు. అమ్మ టొటొచాన్ చెయ్యిపట్టుకుని టికెట్లిచ్చేసే గేట్లోంచి బైటికి దారి తీసింది. టొటొచాన్ అంతకు ముందెప్పుడూ రైలెక్కలేదు. అందుకే ఆ రైలు టిక్కెట్టు చాల విలువయినదిగా కనిపిస్తోంది. దాన్ని గట్టిగా పట్టుకుంది. వదిలెయ్యాలంటే చాల కష్టంగా ఉందా అమ్మాయికి.

"నేనిది ఉంచేసుకోవచ్చాండీ?" అని అడిగింది టొటొచాన్ టికెట్ కలెక్టర్ను. ఆ పాపచేతుల్లోంచి టికెట్ తీసేసుకుంటూ, “కుదరదు. నువ్వది ఉంచేసేకోవడానికి వీల్లేదు" అన్నాడాయన.

"అవన్నీ మీవే?” అనడిగిందా పాప, ఆయన పెట్టెనిండా ఉన్న టికెట్లను చూపెడుతూ. “కాదు, అవన్నీ రైల్వే వాళ్లవి" అంటూనే వెళ్లేవాళ్ల చేతుల్లోంచి టికెట్లు తీసుకుంటున్నాడాయన.

టొటొచాన్ ఆ పెట్టెవేపే దీక్షగా చూసింది. ముందుకు అడుగులువేస్తూ "ఒహ్ పెద్ద పెరిగాక నేను రైలుటికెట్లమ్మే పనిచేస్తాను" అంది.

టికెట్ కలెక్టర్ మొట్టమొదటిసారి ఆ అమ్మాయివైపు చూశాడు. "మా చిన్నబ్బాయి కూడా స్టేషన్లో ఉద్యోగం కావాలంటున్నాడమ్మా. ఎంచక్కా మీరిద్దరూ కలిసి పనిచేయొచ్చు" అన్నాడు...............

  • Title :Railu Badi
  • Author :N Venugopal
  • Publisher :Hydrabad Book Trust
  • ISBN :MANIMN5838
  • Binding :Papar Back
  • Published Date :2024 5th print
  • Number Of Pages :169
  • Language :Telugu
  • Availability :instock