ఒప్పందాల ఉరితాళ్ళు
మండే రైతు గుండెల ఎజెండాలు
ఢిల్లీ సరిహద్దులలో జండాలై
రెపరెపలాడుతున్నాయి
నేలను నమ్ముకున్న వారి నడ్డివిరిచి
లేపనం రాసి ఉపశమన చర్యలతో
ఓదార్పు చర్చలతో కాలక్షేపం!
ఆకలి ప్రేగుల ఆగ్రహం ఉప్పెనై
ఢిల్లీ వీధుల్లో కట్టలు తెంచుకుని
హోరున ప్రవహిస్తోంది!
కసాయి (కాషాయ) చట్టాలను తిరస్కరిస్తూ
తలపాగా సవాల్ విసురుతోంది!
"రోదీ తిను బేటా" అంటే
లారీ రుచి చూపించారు.
దాహం తీర్చిన చెమట చేతులకు
బేడీలను తగిలించారు.
కన్నీళ్ళూ కడగండ్లను దిగమింగి
ఆకలి తీర్చిన అన్నదాతలం
మావి గొంతెమ్మ కోరికలు కావు
కష్టించిన కండరాలు
రాల్చిన చెమట చుక్కలకు
కనీస మద్దతు ధరను కోరుతున్నాము
పచ్చని రైతు పంటను ఎండగడితే
రైతు భేరి (కవితలు, పాటలు)............