• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Raja Nayani Venkata Ranga Rao Bahadur

Raja Nayani Venkata Ranga Rao Bahadur By Kesava Pantulu Narasimha Sastri

₹ 30

రాజా నాయని వెంకటరంగారావు బహద్దరుగారు

భారత స్వాతంత్ర్య లబ్దికి పూర్వం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో సంస్థానములు, జమీందారీలు, జాగీర్లు, మఖ్తగ్రామములు, దేశముఖ్ దేశ పాండ్యాల పరిపాలనా ప్రాభవంకల పల్లెలు పట్టణాలు ఉండినవి. వాటి అధిపతులైన వారిలో దేశం, దేశ ప్రజలు, సారస్వతం, సాహిత్యం, సంస్కృతి, అన్న విషయాలపై మక్కువ గలవారు కూడా ఉండిరి. కనుకనే ఈనాడు మనం కళాసాహిత్య సంస్కృతులకు సంబంధించిన యే నూతన కార్యమును తలపెట్టినప్పటికిని దానికి పునాదిగా, పూర్వరంగముగా కొంత ఆధారం లభిస్తుంది.

మైసూరు, విజయనగరం, గద్వాల మొదలయిన సంస్థానముల అధిపతులు కళాసాహిత్య పోషణమును చేసి దేశమునకు, దేశీయులకు కొంత మేలును చేకూర్చినారు. దేవాలయ, విద్యాలయ చికిత్సాలయాదులను నెలకొల్పి దేశప్రజల కళా విజ్ఞానములకు, ఆరోగ్య భాగ్యములకు యథాశక్తిగా దోహదమును కలిగించినారు. శ్రీరాజా నాయని వెంకటరంగారావుగారు ఆ కోవకు చెందిన జమీందారులై యుండిరి. క్రీ.శ. 1875లో వరంగల్లు జిల్లా, మానుకోట తాలుకాలోని నెల్లికుదురు గ్రామమునందు నాయని రాఘవరెడ్డిగారు శ్రీమతి గోపమ్మగారు అను పుణ్యదంపతులు గర్భమున జన్మించిరి. నాయనివారు రెడ్డి కులంలోని మోటాటి శాఖకు చెందినట్టివారు. ఈ మోటాటి శాఖీయులైన రెడ్లలో చాలామంది సంస్థానాధీశీలుగను, దేశముఖులుగను, జాగీర్దార్లుగను ఉన్నట్టివారు. సుమారు రెండువందల సంవత్సరాలకు పూర్వం అలంపురం సంస్థానమును పరిపాలించిన బిజ్జులవారు, వనపర్తి, గోపాలపేట ప్రభువులై యుండిన జనుంపల్లివారు, బాబాసాహెబ్పేట రెడ్రెడ్డివారు. వన్నాజిపేట.............

  • Title :Raja Nayani Venkata Ranga Rao Bahadur
  • Author :Kesava Pantulu Narasimha Sastri
  • Publisher :Nava Chetan Publishing House
  • ISBN :MANIMN3786
  • Binding :Papar back
  • Published Date :Oct, 2016
  • Number Of Pages :37
  • Language :Telugu
  • Availability :instock