• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Raja Syamala Homam

Raja Syamala Homam By Rajamandri Kalabairava Swamiji

₹ 360

మనసులో మాట....

రాజశ్యామల హోమమ్

మనల్నీ ఎవ్వరూ మార్చరు - మనమే మారాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇంకేదో ఇస్తారు, మనల్ని ఉద్దరిస్తారు, మన కష్టాలను పోగొట్టేస్తారు, అనే వట్టి మాటలు, మాయమాటలు ప్రక్కన పెట్టి, సత్యం తెలుసుకో మిత్రమా.. సత్యం ఏమంటే నిన్ను నువ్వు తెలుసుకోగలరు, నిన్ను నువ్వు అర్థం చేసుకోగలవు, నిన్ను నువ్వు మార్చుకోగలవు, నిన్ను నువ్వు ఉద్దరించు కోగలవు, మరొక నలుగురిని ఉద్దరించడానికి శ్రమించగలవు, సమాజంలో ధర్మం వర్ధిల్లేలా చేయడానికి, మనం మరింత గొప్ప జ్ఞానులం, ధనికులం, ఆరోగ్యవంతులం, ధర్మోద్ధారకులం కావడానికి - మన జీవితాన్ని, మన అమ్మ నాన్నల జీవితాన్ని, మన జీవిత బాగస్వామి జీవితాన్ని, మన పిల్లల జీవితాన్ని, మన ఆత్మ బందువుల జీవితాన్ని జన్మ సార్థకత చేయడానికి, పావనమయం చేయడానికి అనంతమైన శక్తి మనలో, మనదేహంలో, మన ఆత్మలో దాగి ఉంది. ప్రస్తుతం దానికి 9 నల్లని మేఘాలు వంటి నీలి నీడలు మాయ లాంటి, అంతులేని కోరికలు , కామం, క్రోధం, మొహం, లోభం, మదం, మాత్సర్యము, ఈర్ష్యా, ద్వేషాలు, అసూయలాంటి దుర్గుణాల పొరలు మనస్సులో ఆవహించి ఉన్నాయి.

అందుకే మనం కొన్ని కొన్ని సార్లు.. ఆత్మ విరుద్ధమైన పనులు అనగా.. అలా చేయొద్దు, అటు వెల్లోద్దు, ఇలా మాట్లాడవద్దు, వారి వైపు చూడవద్దు, వారితో మాట్లాడవద్దు, వారితో స్నేహం చేయవద్దు, వారిని నమ్మవద్దు అని మన యొక్క ఆత్మ.. ఆత్మ జ్ఞాన బోధన చేస్తున్నా, సత్యము చెపుతున్నా దానికి వినకుండా, కనీసం ఆలోచించకుండా ఆ నిమిషానికి, ఆ రోజుకి కొన్ని కోరికలు తీర్చుకోవడం కోసం, డబ్బుకోసం, భౌతిక, శారీరక సుఖాల కోసం మనస్సును చంపుకొని, మనస్సుకు వ్యతిరేకంగా, ప్రకృతికి విరుద్ధంగా, ధర్మానికి వ్యతిరేకంగా పని చేసి కొన్ని కష్టాలు, దుఖాలు, సమస్యలు కోరి తెచ్చుకుంటున్నాము.. మరి మనం అసలైన..........

  • Title :Raja Syamala Homam
  • Author :Rajamandri Kalabairava Swamiji
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN4061
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :304
  • Language :Telugu
  • Availability :instock