రాజా వారి మహల్
(ఇది 1980వ దశకం నాటి కథ)
మొదటి భాగం
ఒకప్పుడు ఊరికి దూరంగా వున్న మహల్ ఊరు పెరగడం వలన ఊరి మధ్యకు వచ్చింది. ఆ చుట్టు ప్రక్కల వంద గ్రామాలకు జమిందార్, రాజా బహద్దూర్ ధర్మేంద్ర భూపతి వారు, దగ్గర వుండి వారి అభిరుచికి తగ్గట్టుగా ఎకరం స్థలంలో సువిశాలంగా కట్టించిన మహల్ అది. గానుగ సున్నంతో కట్టిందేమో, చాలా పటిష్టంగా వుంది. కట్టి సుమారు వంద ఏళ్ళ ఐనా చెక్కు చెదర లేదు. అక్కడక్కడ పెచ్చులు వూడటం, రంగు వెలియడం తప్ప, ఆ మహల్ అందం కొంచెం కూడా తగ్గలేదు.
జమిందార్ గారి ఏకైక సంతానం, శివేంద్ర భూపతి వారు పెద్ద చదువులకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రాజా వారు, రాణి వారు జీవించి వున్నంత వరకు శివేంద్ర భూపతి వారు అమెరికా నుండి వస్తూ పోతూ వుండేవారు.
పెద్ద జమిందార్ గారి మరణం తరువాత వంశపారంపర్యంగా శివేంద్ర భూపతి వారికి సంక్రమించిన అస్తులలో, దేవాలయం నిర్మాణం కోసం కొన్ని డబ్బులు, దేవుని నిత్యపూజలకు, కైంకర్యాలను జరిపించుటకు వంద ఎకరాల పంట భూమిని స్వామి వారి పేర రాయించారు. మహలు, మహల్ చుట్టూ వున్న ఐదు ఎకరాల స్థలం వదిలేసి, మహల్ నిర్వహణ బాధ్యతను తోటమాలి రామయ్యకు అప్పచెప్పి, ఆ ఐదు ఎకరాల ఫల సాయం తింటూ బ్రతకమని చెప్పి, మిగిలిన మొత్తం ఆస్తిలో ఒక రెండు వందల ఎకరాలు పోను మిగతా.....................