అధ్యాయం 18
సామ్రాజ్యవాదం - పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ గుత్త పెట్టుబడిదారీ విధాన మౌలిక ఆర్థిక
గుత్త పెట్టుబడిదారీ విధానానికి ముందున్న పెట్టుబడిదారీ విధానంలో స్వేచ్ఛా పోటీ ప్రబలంగా ఉండేది. ఈ పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెంది, 1860-1870లలో శిఖరాన్ని చేరుకుంది. 1870 తర్వాతి కాలంలో పెట్టుబడిదారీ విధానం - గుత్త పెట్టుబడిదారీ విధానానికి ముందున్న పెట్టుబడిదారీ విధానం నుండి గుత్త పెట్టుబడిదారీ విధానానికి పరివర్తన చెందింది. 19వ శతాబ్దపు చివరి కాలంలోనూ, 20వ శతాబ్దపు ప్రారంభంలోనూ గుత్త పెట్టుబడిదారీ విధానం అంతిమంగా రూపు దిద్దుకుంది.
గుత్త పెట్టుబడిదారీ విధానం లేదా సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ, అంతిమ దశ. స్వేచ్ఛా పోటీని తొలగించి గుత్త సంస్థలు ప్రాబల్యం సంపాదించడం, గుత్త పెట్టుబడిదారీ విధానానికీ, అంతకు ముందున్న పెట్టుబడిదారీ విధానానికీ మధ్య భేదాన్ని చూపించే విశిష్ట లక్షణంగా ఉంటుంది.
బూర్జువా సమాజంలో ఉత్పత్తి శక్తుల, ఉత్పత్తి సంబంధాల అభివృద్ధి ప్రక్రియ మొత్తం, గుత్త పెట్టుబడిదారీ విధానానికి ముందున్న పెట్టుబడిదారీ విధానాన్నుండి గుత్త పెట్టుబడిదారీ విధానానికి (సామ్రాజ్యవాదానికి) పరివర్తనకు రంగాన్ని సిద్ధం చేసింది....................