స్వాతంత్రోద్యమ సేనాని
డా.జి.జి. పారిఖ్ గారి సందేశం
అనువాదం : అరుణా ప్రసాద్
ప్రియమైన ఆనంద్ కుమార్,
మధులిమాయే జన్మశతాబ్ది సమరోహ సమితి వారు మధు గారి స్మారక సంచికను మే 1వ తారీఖుకి ప్రచురిస్తున్నారని మీ లేఖ వలన తెలిసినది. సమాజవాది ఉద్యమంలో (సోషలిస్టు ఉద్యమం) మధుగారు ఒక ధృవతార అని చెప్పొచ్చు. సమాజంలో నీతి, నిజాయితీ, నిరాడంబరత, విలువలతో కూడిన రాజకీయుల కోసం ఆయన సలిపిన కృషి అపూర్వం.
మధుగారు ఆంగ్లేయులతో ఎలాగూ పోరాడారు, కానీ స్వాతంత్య్రానంతరం కూడా ఆయన తన పోరాటాన్ని కొనసాగించారు. గోవా విముక్తి ఉద్యమంలో మధు గారి పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకం, ప్రశంసనీయం. లోక్ సభలో ప్రజల సమస్యలను లేవనెత్తడానికి అతను నా మిత్రుడు నాథ్ పై మాదిరిగానే సరిక్రొత్త విధానాలను అవలంబించేవాడు.
స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి విలువలను ప్రస్తుతం దేశంలో పునః స్థాపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మతతత్వం అంశం గురించి దేశ ప్రజలు విశేషించి సమాజవాదులు తీవ్రంగా చర్చించి, మతసామరస్యాన్ని నెలకొల్పడానికి ఊరూరా, వాడవాడలా శాంతి సమితులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది................