• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Rajarajanarendra

Rajarajanarendra By Emani Shivanagireddy

₹ 90

వేంగీ (తూర్పు) చాళుక్యులు

బాదామీ చాళుక్యరాజైన రెండో పులకేశి క్రీ.శ. 616 లో చేపట్టిన తూర్పుదేశ దండయాత్రలో కోసల, కళింగ, ఆంధ్రదేశాలను జయించాడు. ఈ దండయాత్రలో ఆంధ్ర దేశంలోని పిఠాపురాన్ని జయించినట్లు మారుటూరు రాగిరేకు శాసనాలు చెబుతున్నాయి. స్థానిక పాలకుల చేతిలో నున్న కష్టసాధ్యమైన స్థల, జల, వన, గిరి దుర్గాలను సాధించటంలో, పులకేశికి, అతని తమ్ముడైన విష్ణువర్ధనుడు సహకరించాడు. అందువల్ల విష్ణువర్ధనునికి విషమసిద్ధి అనే బిరుదు దక్కింది. కునాళ (కొల్లేటికోట- జలదుర్గాన్ని) కూడా జయించి, విష్ణుకుండినులు, రణదుర్జయ వంశీయుల చేతిలోనున్న భూభాగాలను సొంతం చేసుకొన్నది కూడా ఈ (కుబ్జ విష్ణువర్ధనుడే. ఇలా, పశ్చిమచాళుక్య రాజైన పులకేశి, తూర్పు దండయాత్రలో తీరాంధ్రాన్ని (తూర్పు ప్రాంతాన్ని) జయించి, వేంగి సింహాసనంపై కుబ్జవిష్ణువర్ధనుణ్ణి ప్రతిష్టించి వెనుదిరిగి వెళ్లిపోయాడు. కుబ్జ విష్ణువర్ధనునితో ప్రారంభమైన వంశీకులను వేంగీ చాళుక్యులనీ, తూర్పు చాళుక్యులని పిలిచారు. ఇలా క్రీ.శ. 624లో ప్రారంభమైన తూర్పు చాళుక్యుల పాలన క్రీ.శ. 1075 వరకూ కొనసాగింది.

తూర్పు చాళుక్య చరిత్రను తెలుసుకోవటానికి వందకుపైగా గల రాగిరేకు, రాతిశాసనాలు, నాణేలు, వారి కట్టడాలు, సమకాలీన సాహిత్యం ఎంతగానో ఉపయోగ పడతాయి. వీరి శాసనాల్లో కొప్పారం, మారుటూరు, పిఠాపురం, చీపురుపల్లి, పెదవేగి, ఉరుటూరు, తేరాల, మచిలీపట్నం, గుంటూరు, నందంపూడి, పెన్నేరు, కలుచుంబర్రు,

, ఈరు, బెజవాడ, తాడికొండ, శ్రీకూర్మం, మలియంపూడి, ఆరుంబాక, మాగల్లు, సిరిపూడి, నిడము, పెదమద్దాలి, ఇంటూరు, అహదనకరం, కందుకూరు, చేజర్ల, విప్పర్ల, మాచర్ల, కాకుమాను, లక్ష్మీపురం, చేబ్రోలు, ధర్మవరం ముఖ్యమైనవి. వీటిద్వారా తూర్పు చాళుక్యుల దండయాత్రలు, సామంతరాజులు, సాధించిన భూభాగాలు, కోటలు, చేసిన

వేంగీచాళుక్య మేరునగధీర రాజరాజనరేంద్ర.................

  • Title :Rajarajanarendra
  • Author :Emani Shivanagireddy
  • Publisher :Vishalandra Publishing Housing
  • ISBN :MANIMN4104
  • Binding :Papar back
  • Published Date :Feb, 2023
  • Number Of Pages :95
  • Language :Telugu
  • Availability :instock