తప్పక చదవాల్సిన రచన
ఇప్పుడు రాజ్యాంగం గురించి, అది మనకిచ్చిన హక్కులు, అవకాశాల గురించీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే, రాజ్యాంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. దేశ ప్రజలకు కల్పించిన హక్కులు త్రోసివేయబడుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తినీ, విలువల్నీ ధ్వంసం చేయదల్చిన శక్తులు పాలకులుగా వచ్చారు. ప్రజాస్వామిక పద్ధతులకూ వీడ్కోలు పలుకుతున్నారు. లౌకిక, సామ్యవాద లక్ష్యాలను తుంగలో తొక్కి మతోన్మాద, నియంతృత్వ ధోరణులతో ముందుకు వస్తున్నారు. ఇదొక ప్రమాదకర పరిణామం. దేశ ప్రజలు, ముఖ్యంగా యువత వీటన్నింటినీ తిప్పికొట్టేందుకు పూనుకోవాలి.
అందుకు భారత సమాజ చరిత్ర అధ్యయనం చాలా అవసరం. అప్పుడు మాత్రమే భారతీయ సమాజపు జీవన పరిణామాల ఆధారంగా ఏర్పడిన రాజ్యాంగమూ, దానిలో వున్న విషయాలు అప్పుడే అవగాహనలోకి వస్తాయి. అలా అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో సులభంగా, సరళంగా, క్లుప్తంగా, సూటిగా రాజ్యాంగాన్ని, అందులోని ముఖ్యాంశాలను, చారిత్రక పూర్వాంశాలను విశదపరుస్తుందీ పుస్తకం. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన హెచ్.ఎన్. నాగమోహన్ దాస్ గారు ఈ పుస్తకాన్ని రచించగా దీన్ని తెలుగులో మీ ముందుకు తెస్తున్నాము. కన్నడలో విశేష ప్రజాదరణ పొందిన ఈ పుస్తకాన్ని తెలుగు ప్రజలు ఆదరిస్తారనే నమ్మకముంది. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు తప్పనిసరిగా చదవాల్సిన రచన ఇది. దీన్ని తెలుగులోకి తేవటంలో సహకరించిన అనువాదకులు జి. సత్యనారాయణ రెడ్డి, కొండూరి వీరయ్య గార్లకు కృతజ్ఞతలు.................