• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Rajyam Viplavam V I Lenin

Rajyam Viplavam V I Lenin By Rachamallu Ramachadra Reddy

₹ 125

ఉపోద్ఘాతం

లెనిన్ సుప్రసిద్ధ రచన "రాజ్యం- విప్లవం' 'రాజ్యం' పట్ల మార్క్స్, ఎంగెల్స్ ల బోధనలను ఒక సమగ్ర పద్ధతిలో వివరించడమే గాక, మార్క్సిజాన్ని మరో అడుగు ముందుకు తీసుకుపోయిన ప్రామాణిక గ్రంధం. మన దేశంలో సమూలమైన సామాజిక మార్పును సాధించాలని, దోపిడీ, పీడన లేని సమాజాన్ని నిర్మించాలని కోరుకునేవారు, ముఖ్యంగా ఆ లక్ష్యం కోసం పాటుపడే ప్రతీ ఒక్కరూ తప్పక అధ్యయనం చేయవలసిన గ్రంధం ఇది. తనను కొద్ది గంటల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీయబోతోందని తెలిసినప్పటికీ, మరణించేలోపు ఏ విధంగానైనా పూర్తిగా చదవాలన్న ఆసక్తిని షహీద్ భగత్సింగ్ లో కలిగించిన పుస్తకం "రాజ్యం-విప్లవం”.

నేపథ్యం

రష్యాలో పచ్చి నిరంకుశ పాలన సాగించిన 'జార్' ప్రభుత్వాన్ని 1917 ఫిబ్రవరిలో కూలదోశారు. కార్మికవర్గం ఆ విప్లవంలో మొనగాడుగా నిలిచి నాయకత్వ పాత్ర పోషించింది. లక్షలాదిగా రైతాంగం కార్మికవర్గంతోబాటు ఆ తిరుగుబాటులో భాగస్వాములయారు. కార్మిక కర్షక ఐక్యతను సాధించడంలో, దానిని ఒక సాయుధ శక్తిగా రూపొందించడంలో బోల్షివిక్ పార్టీ కీలకపాత్ర పోషించింది. ప్రవాసంలో ఉంటూనే లెనిన్ బోల్షివిక్ పార్టీకి మార్గనిర్దేశం చేశాడు.

జారు స్థానంలో కొత్తగా ఏర్పడిన కెరెన్స్కీ ప్రభుత్వం బూర్జువా వర్గ నాయకత్వాన ఉంది. సోవియట్ లో (పార్లమెంటు) వేర్వేరు పార్టీలకు చెందినప్పటికీ, కార్మిక, కర్షక ప్రతినిధులు ఎక్కువమంది ఉన్నారు. ఈ దశలో కార్మికవర్గ విప్లవ పార్టీ తన కార్యకలాపాలను వేగంగా విస్తరించి ప్రజలను సంఘటితం చేసి వీలైనంత త్వరలో అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని, జారు స్థానంలో బూర్జువా ప్రతీఘాత శక్తులు బలపడేందుకు అవకాశం ఇవ్వకూడదని లెనిన్ తన లేఖలలో బోల్షివిక్ పార్టీకి తెలియజేశాడు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పట్ల అతనికి భ్రమలు ఏ కోశానా లేవు. ఆ దశను వీలైనంత త్వరగా దాటి విప్లవాన్ని ఆ పై స్థాయికి, అంటే, కార్మికవర్గ విప్లవంగా మలిచేందుకు ప్రయత్నించాలని లెనిన్ బలంగా కోరుకున్నాడు............................

  • Title :Rajyam Viplavam V I Lenin
  • Author :Rachamallu Ramachadra Reddy
  • Publisher :Praja Shakthi Book House
  • ISBN :MANIMN6149
  • Binding :Papar back
  • Published Date :Feb, 2025
  • Number Of Pages :144
  • Language :Telugu
  • Availability :instock