ప్రొ॥ శేషయ్య రచనా సర్వస్వం - 1 రాజ్యాంగం - పౌరహక్కులు
ప్రొ॥శేషయ్య గారు ప్రజాస్వామ్య భావనను అమూర్తంగా చూడరు. మన సమాజంలో ప్రజాస్వామికీకరణకు ఉన్న అవరోధాల వైపు నుంచి ప్రజాస్వామ్యాన్ని చూస్తారు. అందుకే దాన్ని సాధించడంలో రాజ్యాంగానికి ఉన్న పరిమితులను అద్భుతంగా చెబుతారు. దీన్ని అధిగమించడానికి కోర్టు ద్వారా, చట్టాల ద్వారా, హక్కుల ప్రచారం ద్వారా నిరంతరం కృషి చేయాల్సిందే. అందులో పౌరహక్కుల ఉద్యమానికి కీలక స్థానం ఉంటుంది. అయితే రాజకీయ ఆచరణలో భాగంగా ఎదిగే ప్రజా చైతన్యంతో సంబంధం లేకుండా రాజ్యాంగంలోని వైరుధ్యాలను అధిగమించడం సాధ్యం కాదని స్పష్టత ఆయనకు ఉంది. ప్రజల చైతన్యమే అనేక వైపుల నుంచి ప్రజాస్వామికీకరణకు దారి చూపుతుందని చెప్పడమే శేషయ్యగారి రచనల సారాంశం.