• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ralla Vanki

Ralla Vanki By A Kuprin

₹ 200

మోలఖ్*

మరో పనిదినం మొదలైందని ప్రకటిస్తూ మిల్లు సైరను చాలాసేపు మోతపెడుతూ చూసింది. గాఢమైన ఆ కర్కశ ధ్వని భూమిలోతుల్లోనుంచి వచ్చి, నేలబారుగా పైన వ్యాపిస్తున్నట్టుంది. ఆగస్టు మాసపు వాన రోజు మబ్బు ఉదయం అందులో విచారాన్నీ, దుశ్శకునాన్నీ కనిపింప చేసింది.

ఆ సైరను కూతప్పుడు ఇంజనీరు బొబ్రోవ్ టీ తాగుతున్నాడు. గత కొన్నిరోజులుగా అతను అంతకుముందు యెన్నడూ లేనంతగా నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్నాడు. రాత్రిపూట శిరోభారంతోటి మంచంమీదకి చేరినా, ప్రతిక్షణం ఒక కుదుపుతోటి ఉలికిపడ్డా, చిత్తం స్వాస్థ్యంలేని నిద్ర తూలు మాత్రమే వుండేది. కాని తెల్లవారడానికి చాలా ముందే, చీదరగా చిరాగ్గా మెలకువ వచ్చేది.

ఆ పరిస్థితి మానసిక, శారీరక శ్రమవల్ల, మత్తు ఇంజక్షన్లు తీసుకునే పాత అలవాటువల్ల వచ్చిందని అనడంలో అనుమానం లేదు. ఆ అలవాటుని మానుకోవాలని యీ మధ్యనే అతను మనస్ఫూర్తిగా ప్రయత్నించ నారంభించాడు.

అతను టీ తాగుతూ కిటికీ దగ్గర కూర్చున్నాడు. టీ చప్పగా, రుచీ పచీ లేకుండా వుంది. వాన చినుకులు కిటికీ అద్దాలమీద వంకరటింకరగా జారిపోతున్నాయి. నీటికుంటల్లో నీళ్లని చెదరగొట్టి, చిరు అలల్ని రేపుతున్నాయి. కురచగా మోడుగా వున్న కాండాలతో, బూడిదరంగు ఆకుపచ్చ ఆకులతోటి గుబురు విల్లో పొదలు చట్రంగా యేర్పడ్డ నలుచదరపు కుంట కిటికీలోనుంచి కనిపిస్తుంది. కుంట ఉపరితలంపైన గాలి తెరలు వీచి, చిన్న అలలు దూసుకుపోయేటట్టు చేస్తున్నాయి. విల్లో ఆకులు వెండి రంగు తిరుగుతున్నాయి. వన్నెతగ్గిన గడ్డి వానికి అణగి, నేలమీదకి వంగిపోయింది. పొరుగున వున్న గ్రామం, దిఙ్మండలం దాకా పరుచుకున్న నల్లని యెగుడుదిగుడు అడవి, నలుపు పసుపు రంగులతో వున్న పొలాలు బూడిదరంగుగా, మసకగా పొగమంచులో వున్నట్టుగా వున్నాయి.

*మాలఖ్ - ప్రాచీన ఫోనీషియా, కార్తేజ్ యింకా యితర ప్రాంతాల్లో సూర్యుడు, అగ్నికి యుద్ధానికి అధిదేవుడు. పిల్లల్ని హెూమ గుండంలో బలిగోరే దేవుడు. కొత్త కొత్త మానవ బలుల్ని కోరే శక్తికి యీ..................

  • Title :Ralla Vanki
  • Author :A Kuprin
  • Publisher :Sahiti Prachuranalu
  • ISBN :MANIMN5688
  • Binding :Papar Back
  • Published Date :Sep, 2024
  • Number Of Pages :288
  • Language :Telugu
  • Availability :instock