• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Rama Janmabhoomi Babri Maseedu

Rama Janmabhoomi Babri Maseedu By c v

₹ 75

రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై సమగ్ర రచన

గుడిపాటి

కవి, విమర్శకులు

కల్పనకీ, వాస్తవానికీ నడుమ అంతరం ఉంది. కానీ కల్పనే వాస్తవంగా భ్రమింపజేసే ఇంద్రజాలం సృజనాత్మక సాహిత్య ప్రత్యేకత. గొప్ప ఇతిహాసాల లక్షణమిది. భారతీయ సాహిత్యంలో ఈ కోవకు చెందిన అద్భుత రచన రామాయణం. శతాబ్దాల తరబడి అనేక మార్పులు చెందుతూ జనబాహుళ్యాన ప్రాచుర్యంలో వుంది. అయితే ఇదంతా కల్పనే తప్ప వాస్తవం కాదు. కనుక రామాయణం చరిత్ర కాదు. చరిత్ర ఆధారిత రచన కూడా కాదు. అయినప్పటికీ రాముడు ఉన్నాడనీ, అతను అయోధ్యలో జీవించాడనీ చెప్పడం హాస్యాస్పదం. ఇలాంటి హాస్యాస్పదాలే ఈ దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ఎజెండా కావడం విడ్డూరం. ఒకవైపున అత్యాధునిక టెక్నాలజీతో వేగవంతమైన మార్పులు వస్తుండగా, మరోవైపున అశాస్త్రీయ, అవాస్తవ భావనల పునాదిగా రాముడి గురించీ, రామజన్మభూమి గురించీ మాట్లాడటం అసంగతం. కానీ అసంగతాలు, అబద్ధాలే నిజాలుగా చెలామణవడం విషాదం. ఈ నేపథ్యాన నేటి తరానికి అవగాహన కల్పించడం, వాస్తవాల్ని ఎరుక పర్చడం, శాస్త్రీయంగా ఆలోచించేందుకు అనువైన సమాచారం, విశ్లేషణలు అందించడం తప్పనిసరి. ఈ దృష్ట్యా సి.వి. రచన 'రామజన్మభూమి-బాబ్రీ మసీదు'కు విశేష ప్రాధాన్యం ఉంది.

రాముడే నిజం కాదన్నప్పుడు, ఇక రామజన్మభూమి అన్న మాట ఎక్కడిది? కోట్ల సంవత్సరాల చరిత్రను కనుగొనే ఆధునిక విజ్ఞానం మన చెంతన ఉంది. దీని ప్రాతిపదికన గమనిస్తే అయోధ్యలోగానీ, మరెక్కడయినా గానీ రాముడు, రాముని కాలం, రాముని పాలనకు సంబంధించిన ఆధారాల్లేవని తేలింది. పుక్కిటి పురాణం అనే మాట సరిగ్గా రామాయణానికి వర్తిస్తుంది. అయినప్పటికీ ఇది అత్యంత ఆకర్షణీయమైన కాల్పనిక రచన. ఆ కథలోని ఇంద్రజాలమే ప్రతి తరం పాఠకులకు ఓ ప్రత్యేక ఆకర్షణ. మొదటిసారి విన్నా, చదివినా విస్మయానికి లోను కావడం తథ్యం...............

  • Title :Rama Janmabhoomi Babri Maseedu
  • Author :c v
  • Publisher :Prajashakthi Book House
  • ISBN :MANIMN5424
  • Binding :Paerback
  • Published Date :June, 2015 First print
  • Number Of Pages :125
  • Language :Telugu
  • Availability :instock