రామకథాసుధ' సంకలనం
బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితో గుణాః! వనినే వక్ష్యామ్యహం బుద్ధ్వా తై మక్త్యుః శ్రవా యతాం నరః॥
(వాల్మీకి రామాయణం, బాలకాండ, ఒకటవ అధ్యాయం, 7వ శ్లోకం) నానాపురాణ నిగమాగమ సంపతం యద్రామాయషే నీగదితం క్యాబిదనప్యతోపి। స్వాన్తః సుఖాయ తులసీ రఘునాథ గాథాభాషా నిబంధమతిమంజుల మాతనోతి|| (తులసీ రామాయణం, బాలకాండ 7)
ఆడినయట్టు లాడకయ యా రఘురాముని సద్గుణావళుల్
మూడయినట్టి కాముల బుట్టినయట్టి మహాకవీశ్వరుల్
పాడినవైన జాలవు ప్రనిమధువాకృతి తర్హితాళికిన్
గోడి సుదర్శనంబు రిపుకుంజర కుంభవి నిట్య క్రియన్
(రామాయణ కల్పవృక్షము, సుందరకాండము, 148)
మిత్రుడు ఎన్.కె.బాబు సంపాదత్వం వహించి, ప్రచురించిన 'నాకు నచ్చిన 'నా కథ', నాలుగవ భాగంలో, ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచించిన కథ 'సీతారాముడొచ్చాడోయ్', 'రామకథాసుధ' సంకలనం రూపొం దించేందుకు ప్రేరణ (ఈ కథ అనివార్య కారణాల వల్ల ఈ సంకలనంలో లేదు.)
సమకాలీన తెలుగు సాహిత్యంలో 'రామదూషణ', రామాయణ కువిమర్శ' - పేరు సంపాదించటానికి, అవార్డులు పొందటానికి రహదారులుగా మారేయి. తమ దృష్టి దోషాలను, బలహీనతలను, జగద్రక్షక సిద్ధాంతాలుగా నమ్మించి, ప్రామాణికత సాధించేందుకు పనిగట్టుకుని కొందరు అడ్డదారిని రహదారిగా మలచుకోవటంతో, ఉత్తమ సాహిత్యంగా పరిగణనకు గురి కావాలన్నా, ఉత్తమ రచయితగా మన్ననలందుకోవాలన్నా, ప్రధాన సాహిత్యస్రవంతిలో భాగం కావాలన్నా ఇలాంటి విచ్ఛిన్నకర, విద్వేషపూరిత, నీచంతో పరిపూర్ణమయ్యే అనౌచిత్య రచనలు చేయటం తప్పనిసరి. అందుకే యండమూరి వీరేంద్రనాథ్ కథ చదివితే ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. తెలుగు సాహిత్యంలో రాముడిని, రామాయణాన్ని అర్థం చేసుకొని, ఔన్నత్యాన్ని అవగాహన చేసుకుని ఔచితీపూర్ణమైన రచనలు వచ్చాయన్న ఆలోచన సంభ్రమాశ్చర్యాలను కలిగించింది. దాంతో ఇలా రాముడిని, రామాయణాన్ని సక్రమమైన రీతిలో ప్రదర్శించిన తెలుగుకథలను సంకలనం చేస్తే, తెలుగు పాఠకులకు రాముడిని, రామాయణాన్ని మరో కోణంలో కూడా దర్శించే వీలునిచ్చినట్లవుతుందన్న ఆలోచన వచ్చింది...............