ఆనందం అపార్ట్మెంట్స్, ఉదయం తొమ్మిదిన్నర.
అంకుల్స్ అందరూ ఆఫీసులకి వెళ్ళిపోయాక, ఆంటీలందరూ కింద కూర్చొని, అక్కడికి రాని మిగితా ఆంటీల గురించి సొల్లేసుకుంటున్నారు.
"ఆ 104 ఓనర్కి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదండీ, ఇంతకుముందు ఉన్నవాళ్ళేమో ఉన్నారో లేదో తెలిసేది కాదు. ఇప్పుడేమో బ్యాచిలర్స్కి ఇచ్చారు” 2004 లక్ష్మి గారు.
“పోన్లెండి, మన అపార్ట్మెంట్స్ కట్టి పదహారేళ్లయ్యింది. మనమంటే తప్పక ఉంటున్నాం గానీ దీంట్లోకి ఎవరొస్తారు, బ్యాచిలర్స్ తప్ప” అంది 302 పద్మ గారు.
వీళ్లు ఇలా నోరు పారేసుకంటా వుంటే, వీళ్ళతో ఏం సంబంధం లేకుండా, ఆడొక్కడికే చాలా పనులున్నాయన్నట్టు, కొరియర్ బాయ్ చక చకా పైకెళ్లి 104 కాలింగ్ బెల్ నొక్కాడు. ఎన్నిసార్లు నొక్కినా ఎవరూ రాలేదు. రారు కూడా. ఎందుకంటే ఆ కాలింగ్ బెల్ పనిచెయ్యదు. ఆ విషయం కొంచంసేపటికి రియలైజ్ అయ్యి, చిరాకుతో డోర్ కొట్టాడు.
"ఒరేయ్ డోర్ తియ్యరా.. ఒరేయ్ డోర్ తియ్యరా.." లోపల అందరూ ఇలా అంటున్నారు తప్ప, ఎవడూ లెగట్లేదు. బయట వాడు డోర్ కొట్టడం ఆపట్లేదు. నైట్ షిఫ్టు చేసివచ్చి, అప్పుడే గంట క్రితం పడుకున్న ముగ్గురు లేచారు గానీ, అప్పటికే సిటీకి వచ్చి ఆరు నెల్లైనా ఏ జాబ్ చెయ్యకుండా, ఖాళీగా తిరుగుతున్న నానీ మాత్రం................