• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ramaneeya Sri Bhagavatham

Ramaneeya Sri Bhagavatham By Mullapudi Sridevi

₹ 350

శ్రీరామ
 

సంభవామి యుగే యుగే

శ్రీ గణేశాయ నమః

సాయంకాలమైంది. దేవుడికి నమస్కారం చేసుకుని, పోతనగారిని తలుచుకుని పుస్తకం తెరిచాను. వరండాలో కూర్చున్నాను. అనన్య వచ్చింది.

"బామ్మా రోజూ భాగవతం చదువుతూనే ఉంటావు కదా- ఎన్నాళ్ళు చదువుతావు - ఎవరి కథ అది బామ్మా- అందులో ఏముంది?” అని అడిగింది.

"ఇది పోతన గారి భాగవతం. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన భాగవతాన్ని తెలుగులో పోతనగారు అందంగా, అంత గొప్పగా రాశారు.” అన్నాను.

“అంత గొప్పది ఎందుకైంది అది?" అంది అనన్య.

"శ్రీ మహా విష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వచ్చిన కథ ఇది. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి విష్ణుమూర్తి వివిధ కాలాల్లో, వివిధ రూపాల్లో పదిసార్లు దిగి వచ్చాడు. చెడ్డవాళ్ళని సంహరించి, మంచివాళ్ళని కాపాడాడు. వాటినే దశావతారాలు అంటారు.” చెప్పాను.

"ఓ దశావతారాలా. నాకు తెలుసు బామ్మా - మా తెలుగు పుస్తకంలో ఉంది ఈ పాఠం." "అయితే చెప్పు. దశావతారాలు అంటే ఏమేమి అవతారాలు?" అడిగాను.

“నాకు తెలుసులే. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ, కల్కి అవతారాలు.

ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో వచ్చి రాక్షసులను చంపి ధర్మాన్ని కాపాడాడుట" అంది అనన్య.

"ఈ పది అవతారాలనే కాకుండా దేవుడు మంచివాళ్ళకి, బలహీనులకి ఎప్పుడు ఏ కష్టం. వచ్చినా కాపాడటానికి సిద్ధంగా ఉంటాడు. భూమి మీద మంచివాళ్ళని చెడ్డవాళ్ళు బాధలు పెడుతున్నప్పుడు, లోకంలో చెడ్డతనం, దుర్మార్గం పెరిగి పోతున్నప్పుడు దేవుడు దిగి వచ్చి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టుతాడు."

"ధర్మమంటే ఏమిటి? అధర్మమంటే ఏమిటి?" ఆసక్తిగా అడిగింది అనన్య.

"తన సుఖాన్ని వదులుకుని అయినా, ఇతరుల కష్టాల్ని పోగొట్టి వాళ్ళకి మంచి చెయ్యడం ధర్మం. తన సుఖం కోసం, తన బాగు కోసం ఇతరులను కష్టపెట్టడం అధర్మం. ఒక్కొక్కసారి మంచివాళ్ళు బలహీనులవుతారు. చెడ్డవాళ్ళు బలవంతులవుతారు. బలవంతులైన చెడ్డవాళ్ళని ఎదిరించలేక మంచివాళ్ళు కష్టాల పాలవుతారు. అప్పుడు భగవంతుడు వచ్చి మంచివాళ్ళని రక్షిస్తాడు. చిన్నప్పుడు. నీకు ఈ శ్లోకం చెప్పాను. గుర్తుందా?................

  • Title :Ramaneeya Sri Bhagavatham
  • Author :Mullapudi Sridevi
  • Publisher :Akshagna Publications Prachurana
  • ISBN :MANIMN5214
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :364
  • Language :Telugu
  • Availability :instock