₹ 100
ఈ కధల్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఇండ్ల చంద్రశేఖర్ అనే రచయితని నేను ఎరగను. అతడి కధల్ని నేను చదవలేదు. కొన్ని అంతర్జాల పత్రికల్లోనూ, రెండో మూడో ఆదివారం దిన పత్రికల్లోనూ వచ్చినట్లుంది. అతడు ఎలా ఉంటాడో తెలీదు. ఎక్కడి వాడో తెలీదు. ఏ ప్రాంతాన్ని పరిచయం చేస్తున్నాడో తెలీదు. ఏ జీవితాన్ని తెలుగు పాఠకుల కళ్ళ ముందు బొమ్మ కటిస్తున్నాడో తెలీదు. మొత్తం మీద పన్నెండు కధలు నా చేతిలోకొచ్చి చేరేయి. ఆఫీసు పని వత్తిది, ఇటీవల కాలపు సమస్యలు - కధల్ని ఒక్కొక్కటి చదివేసరికి నెల - ఈ నాలుగు మాటలు రాయడానికి మరికాసిన రోజులు -
చంద్రశేఖర్ ది ఒంగోలు పక్కనుండే కందులూరు పల్లె నుంచి వచ్చిన వాడు. హైదరాబాద్ లో స్థిరపడినట్టుంది. ఈ కధల్లో చిత్రించిన వాతావరంణం, జీవితం, నా ముందు రూపు కట్టిన అనేక పాత్రలు, జీవితం చుట్టూ అల్లుకున్న సమస్త భావోద్రేకాలు - ఈ కధలు నవ్విస్తాయి, ఏడిపిస్తాయి కలల్లో నడిపిస్తాయి, సెంటిమెంటుని పండిస్తాయి, వీర ఆగ్రహాన్ని, ఆవేశాన్ని రగిలిస్తాయి.
-చంద్రశేఖర్ ఇండ్ల.
- Title :Rangula Chikati
- Author :Chandrasekhar Indla
- Publisher :Visalandra Publications
- ISBN :MANIMN0565
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :217
- Language :Telugu
- Availability :instock