• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Rangula Paradaa

Rangula Paradaa By Bina Devi

₹ 100

ఎన్ని రంగులు వేసినా పరదాయే కదా!

ప్రఖ్యాత ఇంగ్లీష్ రచయిత సోమర్సెట్ మామ్ (1874-1965) రాసిన 'ది పెయింటెడ్ వేల్' అనే నవలకు 'రంగుల పరదా' గా తెలుగులో అనువాదం చేశారు బీనాదేవి గారు.

పేర్లు, స్థలాలు ఇంగ్లీష్, హంగ్ కాంగ్లలో సాగినా, మానసిక ఘర్షణలు, కథ సాగే పద్ధతిలో తెలుగు తనం ఉట్టిపడుతోంది ఈ నవలలో. కథానాయకి 'కిట్టి గారిస్టిన్' యొక్క జీవనగమనం, ప్రేమ, పెళ్ళి, విశ్వాసం, ఆకర్షణల మధ్య ప్రయాణం ఎంతో చక్కగా చిత్రీకరించాడు మామ్.

"నాకు అమ్మాయి కావాలి. ఎందుకో తెలుసా? నేను చేసిన తప్పులు అది చేయకుండా పెంచుతాను. నా చిన్నతనం గుర్తుకువస్తే నన్ను నేను అసహాయ్యించుకుంటున్నాను. నేను నా కూతుర్ని స్వేచ్ఛగా వుండేటట్లు పెంచుతాను. తన కాళ్ళమీద తాను నిలబడేటట్లు చేస్తాను. నేను ఒక అమ్మాయిని కని, పెంచి, ప్రేమించి, మగాళ్లు ఆవిడతో పడుకొని, ఆవిడకు కేవలం తిండి పెట్టి, బట్టలు ఇచ్చే విధంగా పెంచను" ఇవి కిట్టీ చివరికి చెప్పిన మాటలు. కిట్టి తప్పులను గ్రహించి, తన జీవితాన్ని సన్మార్గంలోనికి తెచ్చుకొంది. ఇదే ఇప్పుడు నవీన వనితకు కావలిసిన ధైర్యం, మార్గం అనిపిస్తుంది. ఈ నవల చదివాకా మామ్ నవలలు చదవాలనిపిస్తుంది. అదే ఈ కథనం ద్వారా అతను సాధించిన విజయం.................

  • Title :Rangula Paradaa
  • Author :Bina Devi
  • Publisher :Sahithi prachuranalu
  • ISBN :MANIMN5819
  • Binding :Papar Back
  • Published Date :Nov, 2024
  • Number Of Pages :144
  • Language :Telugu
  • Availability :instock