• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Rasaanubhavam

Rasaanubhavam By N T G Vasanta Lakshmi

₹ 175

భారతీయ సౌందర్య శాస్త్రం - 1

 

ప్రాచీన భారతీయులు తత్త్వశాస్త్రంలో అత్యున్నత శిఖరాలను అందుకున్న వాళ్ళు అని అనడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాని తత్త్వశాస్త్రం అనే మాటని మనం చాలా అస్పష్టమైన అర్థంలో వాడుతున్నాము. నిజానికి తత్త్వాన్వేషణలలోని పార్శ్వాలను పరిశీలిస్తే అవి సంఖ్యాపరంగా చాలా ఎక్కువగానూ ఉంటాయి, స్వభావంలో ఒకదానికొకటి విభిన్నంగానూ ఉంటాయి. అందువల్ల ఇటువంటి అభిప్రాయం తత్త్వశాస్త్రపు పరిధిని మరీ పరిమితం చేసేస్తుంది. కాబట్టి ఈ వ్యాఖ్యానం భారతీయుల మేధకు ఆధ్యాత్మిక కల్పనల విషయంలో ఉన్న ఒకానొక అభిరుచిని గురించి చెయ్యబడినదే తప్ప మరేమీ కాదు అని అనుకోవలసిందే. ఈ అభిప్రాయంలోని అస్పష్టతను గురించి మాక్స్ ముల్లర్ ఒక గమనార్హమైన వివరణ ఇచ్చారు. అసలు ప్రాచీన భారతీయులందరికీ తత్త్వశాస్త్రంలో భగవద్దత్తమైన ప్రావీణ్యం ఉంది అనే మాటను వ్యాప్తిలోకి తెచ్చిందే మాక్స్ ముల్లర్. ఎందుకంటే ఆయన ఒక సందర్భంలో భారతీయులని “దార్శనికుల జాతి"గా అభివర్ణించారు. మరి ఇంకొక సందర్భంలో ప్రకృతిలోని అందమైన వస్తువుల గురించిన ఆలోచనే భారతీయుల మనస్సులలో ఉండదు' అన్న అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. నిజానికి “భారతీయులు దార్శనికుల జాతి" అన్నమాట కూడా లోతుకి వెళ్లకుండా పైపైన అస్పష్టంగా చెప్పినదే. దీనికి ఉపోద్బలకంగా తర్కం, మనోవిజ్ఞానం, ఆధ్యాత్మికత మొదలైన శాఖలలో జరిగిన తత్త్వాధ్యయనం ఎంత పురోగమించిందో నిరూపించకపోతే ఈ అభిప్రాయానికి అంత విలువ ఉండదు. భారతీయ ప్రాచీనతత్త్వాలను అధ్యయనం చేసే విద్యార్థికి దర్శనశాస్త్రం విస్తృతమైన పరిశ్రమకి అవకాశమిచ్చే క్షేత్రం. ఆ పరిశ్రమ ఫలితాలను ఒకచోట చేర్చి, చక్కగా కాపాడితే అది భారతీయ విచార చరిత్రకే కాదు, విశ్వదర్శనశాస్త్రానికి కూడా ఉపయోగిస్తుందని ఆశించవచ్చు. ఈ వ్యాసం ఉద్దేశం దర్శనశాస్త్రానికి ఒక ఉపమార్గంగా సాగిన సౌందర్యశాస్త్రాలలో భారతీయుల..................

  • Title :Rasaanubhavam
  • Author :N T G Vasanta Lakshmi
  • Publisher :Sahitya Acadamy
  • ISBN :MANIMN4702
  • Binding :Papar Back
  • Published Date :2021 first print
  • Number Of Pages :120
  • Language :Telugu
  • Availability :instock