₹ 300
నా మాట నా కవితాగురువులైన కీ.శే. దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు 1921 ఆగస్టు 1వ తేదీని, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు ప్రక్కనే ఉన్న “మండపాక” అనే గ్రామంలో ధనిక కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు: కీ.శే. రామసోదెమ్మగారు - కీ.శే. సత్యనారాయణమూర్తిగారు. ఈ దంపతులకు ఐదుగురు కూతుళ్ళు, ఏడుగురు కొడుకులు. తిలక్ గారు మొత్తం సంతానంలో ఆరవవారు; కొడుకులలో రెండవవారు.
తిలక్ గారు మరణించిన తేదీని 1966 జూలై 1వ తేదీ అని అందరూ ప్రచారం చేస్తున్నారు. నా ఉద్దేశంలో అది సరికాదు. తిలక్ గారు చనిపోయిన క్రొత్తలో నేను తణుకు వెళ్ళాను. అప్పుడు వారు ఏ తేదీని మరణించారో తిలక్ తమ్ముడు గంగాధర రామారావుగారు, ఇతర మిత్రులు నాకు వివరంగా చెప్పారు. అది 1966 జూన్ 30వ తేదీ రాత్రి అని తెలిసింది. మర్నాడు జూలై 1వ తేది తిలక్ మరణవార్త ఊరంతా వ్యాపించింది. జూలై 2వ తేదీని అన్ని వార్తాపత్రికలలోను ఈ వార్త ప్రముఖంగా ప్రచురితమయింది. అప్పుడు తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు వీరగాథలను గురించి పరిశోధన చేస్తున్న నేను జూలై 2వ తేదీ Indian Express లో తిలక్ మరణవార్త చదివి దిగ్ర్భాంతికి లోనయ్యాను. వెంటనే "తిలక్ అభిరుచులు-అలవాట్లు” అనే పేరుతో 80 పుటల పెద్దవ్యాసాన్ని వ్రాశాను. దీని రచనకు రెండు నెలల కాలం పట్టింది. (అంటే దీని రచనా కాలం: 1966 జూలై, ఆగస్టు మాసాలు.) దీనిలో కొంతభాగం (23 పుటలు) "తిరుపతి సాహిత్య సమితి వ్యాసావళి-3”లో 1972లో ముద్రితమయింది. మిగిలింది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మొత్తం వ్యాసాన్ని, కాలనుగుణమైన చిన్న చిన్న మార్పులతో, ప్రచురిస్తున్నాను. దీనికి మరో ఆరు వ్యాసాలు కూడా చేర్చాను.
- Title :Rasagangadhara Tilakam
- Author :T V Subba Rao
- Publisher :T.V.Subba Rao
- ISBN :MANIMN2612
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :308
- Language :Telugu
- Availability :instock