జాతీయ కవి కువెంపు గారికి నాకూ సుమారు యాబై సంవత్సరాల ఆత్మీయ బాంధవ్యం ఉంది. వారు నా కళ్ళకు ఎప్పుడూ ఒక హిమాలయ పర్వతం వలె కనిపించారు. వారు రాసిన రచనలు నాకు ఎల్లప్పుడూ హిమాలయ పర్వత పంక్తుల వలె కానవస్తాయి. భారత దేశానికి ఒక చివర నుండి మరొక చివరవరకు విస్తరించిన, ఉన్నతమూ గోప్య మయమూ అయిన ఆ పర్వత పంక్తుల హృదయంలో అసంఖ్యాతమైన దేవీ దేవతా మూర్తులున్నారని, (దేవతాత్మ-కాళిదాసువాక్యం) లక్షలాది జనుల నమ్మకం. భారత దేశంలోని అనేక నదులకు హిమాలయాలు జన్మనిచ్చాయి. వివిధ రకాల వనమూలికలకూ, జీవరాశులకూ ఆ పర్వతాలు ఆశ్రయ మిచ్చాయి సూర్యోదయ, సూర్యాస్తమయ, చంద్రోదయ వైభవాలను ప్రతిఫలించే ఆ శిఖరపంక్తులు ఆ పర్వత శ్రేణుల ఉన్నతిని సదా చాటుతూ ఉంటాయి. సృజనశీల శాంతినీ, వినాశకారియైన అప్రతిహత శక్తినీ ఏకకాలంలో వహించిన దివ్య నిగూఢత ఆ పర్వత ఋషి పుంగవునిది. ఆధునిక కన్నడ సాహిత్యాన్ని రూపదిదిద్దన శబ్దశిల్పి రస ఋషి కువెంపు గారి సాహిత్యం సంపద పైన పేర్కొన్న హిమాలయ వైభవానికి ప్రతిరూపం అనిపిస్తుంది.
అలెగ్జాండర్ బ్లాక్ అనే సింబాలిక్ రీతిలో రచించే కవి మాక్సిమ్ గోర్కి గారిని గురించి చెప్పిన మాటలివి: రష్యా అనే పేరులోనే ఉన్న అపారత్వము, అనంతత్వము, అరికట్టలేని ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉండగలిగిన, అపారమైన నమ్మకాన్నిస్తూనే ఉండ గలిగిన, గుణాలను ఎక్కడైనా ఒకచోట మనం చూడగలిగామంటే అది మాక్సిమ్ గోర్కి గారిలోనే, కర్నాటకలో మాత్రమే కాదు. యావద్భారత దేశంలో కవిగా, నాటక కర్తగా, నవలాకారుడిగా, మహాకావ్య సృష్టికర్తగా పేర్కొన గలిగిన ఏకైక వ్యక్తి కువెంపుగారు.
పై అభిప్రాయం నాది మాత్రమే కాదు కొన్ని సంవత్సరాల క్రితం కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఏర్పాటు చేసిన సభలో వివిధ భాషా సాహితీ వేత్తలు వ్యక్తపరచినది. నోబెల్ పురస్కారాన్నిచ్చే యూరోపియన్ సమితివారు మొట్ట మొదటి సారిగా, నోబల్ బహుమానానికి అర్హుడైన భారతీయుని పేరును సూచించ మని కేంద్ర సాహిత్య అకాడమీ.....................