దళిత బ్యాంక్ కు దారి !
1,03,800 కోట్లు - “ఒక లక్షా మూడు వేల ఎనిమిది వందల కోట్లు" ఇదంతా దళితుల డబ్బు. ఈ నంబర్ చూశాక నాకు దిమ్మ తిరిగింది. మనం ఇంత అవగాహన లోపంతో ఎలా బ్రతుకుతున్నాం అనిపిస్తుంది.
ఇక అసలు విషయానికొస్తే మీకో మూడు కథలు చెప్పాలి.
సంస్కరణల యుగం వచ్చాక కూడా, ఇప్పటికీ ప్రభుత్వాలు దళితులను ఆహారం మరియు ఉద్యోగాలు మాత్రమే కోరుకునే వారిగా చూస్తున్నారు. చిన్న చితక పరిశ్రమలతో దళితులు, దళితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి లేకుండా పోయింది. కారణం కుల స్వభావానికి అతీతం కాని బ్యాంకుల యాజమాన్యాలు కూడా ఇప్పటికీ దళితులకు లోన్లు ఇవ్వాలంటే జంకుతాయి. లక్ష రూపాయలు ఇచ్చే ఎస్సీ కార్పోరేషన్స్ లోన్లకే లక్ష ప్రశ్నలు వేసే బ్యాంకులు కోట్ల రూపాయలు ఇవ్వమంటే ఇస్తాయా!...............