రెడ్ సిగ్నల్
సిటీ సెక్యూరిటీ సర్వీసెస్.
తెలుపురంగు బోర్డుమీద నీలంరంగు అక్షరాలు మిలమిల మెరిసిపోతూ కనిపిస్తున్నాయి.
తన స్కూటీని ఆ బోర్డు దగ్గర ఆపి కనులు చిట్లించుకుని చూసింది వాసంతి. సిటీ సెక్యూరిటీ సర్వీసెస్ ని వాత్సవ, అతని స్నేహితుడు శ్యామస్సుందర్ రన్ చేస్తూ వుంటారు. వాసంతి వారి సెక్రటరీ. ఆఫీసును మెయింటైన్ చేయటం ఆమె డ్యూటీల్లో ఒకటి.
“పరమేశ్ ఎక్కడ?” తనను చూడగానే అటెంక్షన్లో నిలబడిన ఆ ఎపార్ట్మెంట్స్ వాచ్మన్ని అడిగిందామె. “ఇప్పటిదాకా ఇక్కడే వున్నాడు... ఇప్పుడే ఎక్కడికో పోయాడు” తనతో పాటు ఆ కాంప్లెక్స్లో పనిచేసే ఆ పరమేశ్ గురించి తప్పుగా చెప్పటం ఇష్టంలేనట్టు, అటూ ఇటూ కాకుండా సమాధానం ఇచ్చాడు అతను.............