₹ 80
కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి గారు తన స్వగ్రామం 5 దశాబ్దాల క్రితం ఎలా ఉందో, కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల ద్వారా ఎన్ని సౌకర్యాలు, అభివృద్ధి పనులు సాధించుకుని పురోగతి చెందిందో చాలా వివరంగా ఈ పుస్తకంలో వివరించారు. తద్వారా ఒక కొత్త ఒరవడినీ సృష్టించారు. ఆనాటి వృత్తుల ఫోటోలు వేయటం మరింత విజ్ఞానదాయకంగా ఉంది. ఎవరికైనా మాతృదేశం పట్ల భక్తి, అభిమానం ఉంటుంది. నేను సాధారణ దేశ ప్రజల గురించి చెప్తున్నాను. సొంత రాష్ట్రం పట్ల, మాతృభాష పట్ల అభిమానం, పుట్టిన గడ్డ మీద ప్రేమానురాగాలు, చాలా సహజం. చదువు కోసం, ఉద్యోగం కోసం, బతుకుదెరువు కోసం, సామాజిక కార్యకలాపాల కోసం, సొంత గ్రామం వదిలి పెట్టి సుదూరంలో ఉన్నప్పుడు, సొంత గడ్డ మీద అభిమానం అనేక రెట్లు పెరుగుతుంది. తామే దేశభక్తులమని, తమ మూర్ఖపు సిద్ధాంతాలను అంగీకరించని వారంతా దేశద్రోహులని నిందించే సంకుచితవాదులు వేరు.
ఈ సందర్భంలో నాకు కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. పాకిస్తాన్ మిలటరీ అధ్యక్షుడు, కరడుగట్టిన నియంత ముషారఫ్, భారత పర్యటనకు వచ్చినప్పుడు, ఆయన చిన్నతనంలో (ఆయన ఢిల్లీలో పుట్టాడు) నివసించిన పాత ఢిల్లీలోని ఇంటిని, గల్లీలను తిరిగి చూసి ఆనందించాడని పత్రికలు రాశాయి. అలాగే భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు, ఆయన పుట్టిన ప్రాంతాన్ని చదువుకున్న లా ర్‌ను చూసి సంతృప్తితో తిరిగి వచ్చాడని రాశారు. పుట్టిన గడ్డ మీద తరగని అభిమానం అది.
- Title :Rekonda Samajika Chaitanyam Grameena Sthithigathulu
- Author :Chada Venkatreddy
- Publisher :Navachetana Publishing House
- ISBN :MANIMN2498
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :165
- Language :Telugu
- Availability :instock