₹ 100
వెంకన్న పాట ఒక దృశ్యమాలికగా, అద్భుత కావ్యంగా, సంగీత రూపకంగా కదలిపోతుంది . మనకు తెలిసిన మనుషులే పనిపాటలు చేసుకునే వాళ్లే, ఊళ్లే, ప్రదేశాలే , చెట్టు చేమలే, పొలాలే, కాలువలే చినుకు రాలని మెట్టప్రాంతాలే, కరువు బతుకులే. సెలకల్లో ఆడే పిల్లల దగ్గర నుంచి, ఆకాసంలో ఎగిరిపోయి కొంగలదాకా ఏది తప్పించుకోలేదు. అంతా అన్ని తన పాటల్లోకి రావాల్సిందే! జనం ఆరాట పోరాటాలన్నీ, సంతోష దుఃఖాలన్నీ తన పాటలు కావాల్సిందే!
నాకు ఎరిక వున్నా కవుల్లో యింత గొప్ప భావుకత యింత సృజనాత్మకత వున్న కవులు చాలా అరుదు. ఈ విషయంలో ఒక పాబ్లో నెరుడా కనపడతాడు, ఒక బాబ్ డిలాన్ కనపడతాడు.
- కె. శివారెడ్డి.
- Title :Rela Puthalu
- Author :Gorati Venkanna
- Publisher :Nava Telangana Publishing House
- ISBN :MANIMN0993
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :104
- Language :Telugu
- Availability :instock