• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Rendu Akaashala Madhya

Rendu Akaashala Madhya By Salim

₹ 200

రెండు ఆకాశాల మధ్య

పందొమ్మిదివందల అరవై ఐదవ సంవత్సరం, ఏప్రిల్ నెల...

ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖకి కేవలం నాలుగువందల మీటర్ల దూరంలో ఉన్న జోరాఫాం గ్రామం...

వంట గదిలోంచి వస్తున్న పరోటాలు కాలున్న కమ్మటి వాసనని ఆస్వాదిస్తూ ఫక్రుద్దీన్ మట్టి గోడలో కట్టిన తన రెండు గదుల యింటిని తృప్తిగా చూసుకున్నాడు. అతనికి ఈ యిల్లంటే ప్రాణం.. ఈ యింటితో అల్లుకుని ఎన్ని జ్ఞాపకాలో.. దాదాపు రెండు వందల ముస్లిం గుజ్జర్ కుటుంబాలు, పాతిక్కి పైగా హిందూ,సిక్కు కుటుంబాలున్న ఆ గ్రామంలోనే అతని బాల్యమంతా గడిచింది. తన చిన్నతనంలో ఆ స్థలంలో ఓ పూరిపాక ఉండేది. తనకు యుక్తవయసు వచ్చాక పాలవ్యాపారం మొదలెట్టాడు. వూళ్లో బర్రెగొడ్లు ఉన్న వాళ్ళ యిళ్ళకెళ్ళి పాలను కొని, క్యాలో నింపుకుని రన్బీర్ సింగ్ పురాకెళ్ళి అక్కడి హోటళ్ళకు అమ్మి డబ్బులు సంపాదించేవాడు.

అలా కూడబెట్టిన డబ్బుల్తో రెండెకరాల పొలం కొన్నాడు. గుడిసె ఉన్న స్థలంలో మట్టితో యిల్లు కట్టుకున్నాడు. పెళ్ళి చేసుకున్నాడు. రెండు బర్రెగొడ్లని, నాలుగు మేకల్పి కొన్నాడు. పాల వ్యాపారంతో పాటు వ్యవసాయం చేశాడు. రెండు బర్రెగొడ్లు నాలుగయ్యాయి. మరో ఎకరం పొలం కొన్నాడు.

ఇప్పుడు ఫక్రుద్దీన్ కి నలభై ఐదేళ్ళు... ముగ్గురు ఆడపిల్లలు.. యిద్దరు మగపిల్లలు.. ఇద్దరాడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి అత్తారిళ్ళకు పంపించేశాడు. పెద్ద కొడుక్కి కూడా ఏడాది క్రితమే పెళ్ళి చేశాడు. దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రన్బీర్ సింగ్ పురా పట్టణంలో అతను చిన్నా చితకా పనులు చేసుకుంటూ అక్కడే కాపురముంటున్నాడు. చిన్న కొడుకు రషీద్ కి, మూడో కూతురు ఫర్జానాకి యింకా పెళ్ళి కాలేదు.

ఇద్దరాడపిల్లల నిఖాల కోసం రెండెకరాల పొలంతో పాటు, అమ్మాల్సివచ్చింది. ఓ మేకని జహేజ్ తో పాటు రెండో . మేకని జహేతో పాటు రెండో అల్లుడికి కానుకగా యిచాడు. రెండు మేకలు పెళ్ళిళ్ళలో విందు కోసం హలాల్ కాబడ్డాయి. ప్రస్తుతం రెండు బరెలు మేక మాత్రమే మిగిలాయి.

ఆ మేకంటే అతని భార్య ఫౌజియాకు ప్రాణం... దానికి మున్నా అని ముదు పేరు పెట్టుకుంది. 'ఫరానా పెళ్ళికి అవసరమైతే...................

  • Title :Rendu Akaashala Madhya
  • Author :Salim
  • Publisher :Navodaya Book House
  • ISBN :MANIMN3725
  • Binding :Papar back
  • Published Date :Aug, 2022
  • Number Of Pages :251
  • Language :Telugu
  • Availability :instock