రెంటాల కూనలమ్మ పదాలు
బలే ఛందోవేత్త
ప్రజా మానసహర్త
తొలి 'కూనపద' కర్త
ఓ కూనలమ్మ
దులిపే నీ చిరునిద్ర
నిలిపె నవతా ముద్ర
బుద్ధి కవి ఆరుద్ర
ఓ కూనలమ్మ
లోకరీతులు కొన్ని
శ్లోక నీతులు* కొన్ని
ఇత్తు కానుకగా, పన్ని
ఓ కూనలమ్మ
(*శ్లోకనీతులు అంటే ప్రశంసలూ నీతులూ అని అర్థం)
పద్యమా శిశువంత,
భావమా పడుచంత
సప్తశతి జగమంత
ఓ కూనలమ్మ