రెవెన్యూ శాఖపై ప్రజాభిప్రాయం
జనన ధృవపత్రం నుండి మరణ ధృవపత్రం దాకా అంతా రెవెన్యూ శాఖే జారీ చేస్తుంది. కరువొచ్చినా, తుఫానొచ్చినా రెవెన్యూ శాఖే ఆదుకుంటుంది. ప్రమాదం సంభవించినా, శవం లేచినా రెవెన్యూశాఖ నిర్వర్తించాల్సిన విధి ఉండే ఉంటుంది. పండుగలు పబ్బాలల్లో, స్కీముల్లో, పంపిణీల్లో, ఎన్నికల్లో రెవెన్యూశాఖ పాత్ర గణనీయమైంది. అటు సామాన్య ప్రజలకూ, ఇటు ప్రభుత్వ పెద్దలకు అనుసంధాత రెవెన్యూ యంత్రాంగం. ఇది ఒక సమన్వయ పరిశీలకుల దృష్టికోణం. సామాన్య ప్రజల అభిప్రాయం వేరు.
ఏదైనా బ్యాంకుకు వెళ్ళి మన ఖాతాలో ఎన్ని డబ్బులున్నాయో కనుక్కోవచ్చు. మన ఖాతాల్లో నిమిషాల్లో డబ్బులు వేయవచ్చు. తీయవచ్చు. ఇతరులకు బదలాయించవచ్చు. డీడీ తీయవచ్చు. చెక్కు రాయవచ్చు. విదేశాల్లో ఉన్న పిల్లలకు నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఖాతా మూసివేయవచ్చు. కొత్తది తెరవవచ్చు. సహఖాతాదారుల్ని చేర్చుకోవచ్చు. మార్చుకోవచ్చు. కావాలంటే అసలు బ్యాంకులోకి అడుగుపెట్టకుండానే సకల వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు.
మనం ఏదైనా పోస్టాఫీసుకు పోయి పది నిమిషాల్లో ఏదైనా పని పూర్తి చేసుకోవచ్చు. ఒక స్కూల్కో, కాలేజీకోపోయి అందులో అడ్మిషన్ పొందే విధానం వెంటనే తెలుసుకోవచ్చు. ఒక ఆసుపత్రికో, యూనివర్సిటీకో పోయి సేవలూ సమయాలూ కొంతలో కొంత అయినా రాబట్టుకోవచ్చు. కొంచెం అటు ఇటుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పనిని ఆశించవచ్చు.
కానీ తహసిల్దార్ ఆఫీసులో పనిపడిందంటే గుండెలో రాయబడ్డట్లే కొంచెం పైకెళ్తే ఆర్టీవోల ఆఫీసుల్లో, కలెక్టర్ కార్యాలయాల్లో పనిపడిందండే వణుకు పుడుతుంది. ఇక కమిషన్రేట్లో పని అంటే అంతే సంగతులు. ఏదైనా ప్రతిపాదనను బొంద పెట్టాలంటే 'సి.సి.ఎల్.ఎ ద్వారా' అని ప్రభుత్వం ఎండార్సు చేస్తుందనేది తెలుగు రాష్ట్రాల...................