• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Revu

Revu By G S Chalam

₹ 100

చలి.. చలి..!

చీకటి పడగానే అడవిలో క్రూరమృగాలు చెంతనున్న పల్లెల మీద పడినట్టు సూరీడు అటు పడమటి కొండల్లోకి జారకముందే పొంచి ఉన్న చలిపులి పేదల పాకల మీదికి పంజా విసిరింది. తలుపు సందుల్లోంచి పైకప్పు కన్నాల్లోంచి కోరలు చాస్తోంది. దాని బారి నుండి చింకి గుడ్డలు దుప్పట్లు పేదల ప్రాణాల్ని కాపాడలేకపోతున్నాయి.

చాకలి పేటలో అదో పూరిల్లు, ముంజూరు పంచలో మంచం చుట్టూ చూరుకు గోనె గుడ్డలు వేలాడేసుకుని లోపల నులక మంచం మీద పైడాలు నిద్రపోతోంది. ఆమెకు కాళ్ళ రావు కళ్ళు సరిగ్గా ఆనవు. పైడాలు మొగుడు పోలిసెట్టి. వాళ్ళకి అంకమ్మ, రామిసెట్టి ఇద్దరే పిల్లలు. అంకమ్మ పెళ్ళీడు కొచ్చేసరికి పోలిసెట్టి సచ్చిపోయాడు. అప్పటికి రామిసెట్టి పదేళ్ళ గుంటడు. అంకమ్మకి పెళ్ళిచేసి పంపించేస్తే గుంటడితో చాకిరేపు పని, వెట్టి పని సాగదని పక్క ఊళ్ళోనే ఉన్న మేనల్లుడు ఆదిసెట్టిని ఇల్లరికం తెచ్చుకుంది.

ఇంట్లో తుంగ చాపమీద అడ్డంగా అంకమ్మకు చెరోవైపు కొడుకు బూసిగాడు. మొగుడు ఆదిసెట్టి పడుకున్నారు. నిద్రలో బూసిగాడు దొర్లుకుంటూ ఒక్కోసారి నేలమీదకు పోతున్నాడు. చలి నేల చురుక్కుమనగానే తిరిగి తల్లి డొక్కలోకి ముడుచుకుపోతున్నాడు. ముగ్గురి వంటిమీదా చలికి ఒకే దుప్పటి నిద్దట్లో దాన్ని బూసిగాడు తనపైకి లాక్కుంటుంటే అంకమ్మ సర్దుతోంది.

ఆ పూరింటికి గుమ్మంవైపు ఒక చెక్క తలుపు పెరటివైపు తడిక ఉన్నాయి. తడిక చిరుగుల్లోంచి గాలి చలిని మోసుకొస్తోంది. వంటింటి గోడ మూలనున్న మసిమానిలో గజ్జికుక్క ముడుచుకుని పడుకుంది. కాలేసిన కుండల మీంచి ఎలకలు అటూ ఇటూ దూకుతున్నాయి. గవ్వాసులో బుడ్డి దీపం సన్నగా వణుకుతోంది.

ఆదిశెట్టి అరిపాదం అంకమ్మకు తగిలి ఆమెకు మెలకువొచ్చింది. శీతగాలికి అతడి పాదాలు పగిలి విచ్చిపోయాయి. విచ్చిన ఆ పగుళ్ళలో నల్ల జీడిరసం గీతలున్నాయి. అంకమ్మ మరుగుకెళ్ళింది. స్మశానంలో అర్ధరాత్రి ముసలి నక్క కూతలాగ ముంజారులోంచి సన్నని కూనిరాగం మొదలై క్రమంగా పెరిగింది. కొడుకు రామిసెట్టి విశాఖపట్నం వెళ్ళి పోయిన్నుంచీ పైడాలు ఏడుపు మొదలు పెట్టింది. మొదట్లో ఆ ఏడుపుకి రాత్రీ పగలు తేడా ఉండేది కాదు. తరువాత తలపుకొచ్చినప్పుడు మాత్రమే ఏడ్చేది. తొలేత ఇరుగు పొరుగు వాళ్ళొచ్చి బుదరించే వాళ్ళు. తరువాత్తరువాత మానుకున్నారు.

అంకమ్మ కాలు మడుచుకోడానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇంకా తల్లి రాగాలు తీస్తూనే ఉంది.

"ఆడు సచ్చినట్టు ఆ సోకాలేటి? ఎక్కడో ఒక్కడ సక్కగా బతుకుతున్నాడు కదా నీ బాదకి ఒక్కడే, నాకు తమ్ముడూ కూతురూ ఇద్దరూ! నానెంతేడాలి. సాల్లే... తొంగో" అని లోపలికెళ్ళి తలుపేసుకుంది.....................

  • Title :Revu
  • Author :G S Chalam
  • Publisher :Hyderabad Books Trust
  • ISBN :MANIMN5393
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :92
  • Language :Telugu
  • Availability :instock