• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

RM Uma Anu Mana Ezra Pound

RM Uma Anu Mana Ezra Pound By Dr Kampalle Ravichandran

₹ 50

ఈ పూనిక వెనక...

స్విడిష్ రచయిత, జర్నలిస్టు స్టీగ్ లార్సొన్ (Stieg Larsson) గురించి ఆయన మిత్రుడు కుర్జ్ బక్స్ (Kurdo Baksi) రాసిన పుస్తకం చదువుతున్నప్పుడు చప్పున నాకు ఉమా గుర్తొచ్చాడు. స్టీగ్ కి కుర్జ్ సహోద్యోగి, మిత్రుడే గానీ వయసురీత్యా చాలా చిన్నవాడు. స్టీగ్ లోని రచయితని, పాత్రికేయుణ్ణి, అధ్యయనశీలిని, నిబద్దుబడిని ఆసక్తిగా, ఆరాధనగా, కొన్ని పర్యాయాలు ఆందోళనగా చూసిన అనుభవాలని గుదిగుచ్చి రాసిన పుస్తకం అది.

నిజానికి స్టీన్ గానీ, ఆయన ప్రసిద్ధ నవలగా పేర్కొనబడే The Girl with the Dragon Tattoo నవలగానీ నా అభిరుచి పఠనీయాంశాలు కావు. ఆయనని అభిమానించే నా మిత్రుడొకరు నాకు కుర్జ్ పుస్తకాన్ని చదవమని ఇచ్చారు. 'ద గర్ల్ విత్ డ్రాగన్ టాటూ '- నవలలో ఒక పాత్ర ఇలా వ్యాఖ్యానిస్తుందట మిడియా గురించి:

The media have the ability to attract the craziest people to call in perfectly absurd tips. Every newsroom in the world gets updates from UFOlogists, graphologists, scientologists, paranoiacs, and every sort of conspiracy theorist.

స్వయానా జర్నలిస్టు అయ్యి, తాను పనిచేసే రంగం మీద స్టీగ్ విసుర్లు ఇలా ఉంటాయి అని చెబుతూ, స్లీగ్ గురించి మీరు తెలుసుకోవాలి అంటూ కుర్దా రాసిన పుస్తకాన్ని నాకు ఇచ్చాడు నా మిత్రుడు.

ఫొటోగ్రాఫర్ గా మీడియాలో ప్రవేశించిన స్టీగ్ నిబద్ద వామపక్షీయుడు, కమ్యూనిస్ట్ వర్కర్స్ లీగ్ సభ్యుడు, ట్రాట్స్కి భావజాలానుకూలపత్రికకి సంపాదకుడు, ఉద్యమకారుడు, విషవ సానుభూతిపరుడు. దానికి తోడు - రైట్ వింగ్ తీవ్రవాదం, జాత్యహంకారధోరణులు మీద విశేష  పరిశోధన చేసాడు, వ్యాఖ్యానాలు రాశాడు. దానివల్ల ఆ వర్గం నుంచి అనేకసార్లు చావు............

  • Title :RM Uma Anu Mana Ezra Pound
  • Author :Dr Kampalle Ravichandran
  • Publisher :Mohana vamsi Prachuranalu
  • ISBN :MANIMN3645
  • Binding :Papar back
  • Published Date :Oct, 2022
  • Number Of Pages :40
  • Language :Telugu
  • Availability :instock