• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

RSS Pranalika 21va Shatabdam Kosam

RSS Pranalika 21va Shatabdam Kosam By Sunil Ambekar

₹ 150

ఆర్ఎస్ఎస్ నిన్న-నేడు-రేపు

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్ళు పూర్తయినపుడు, 2007లో నా మదిలో ఒక ప్రశ్న మెదిలింది. వలస పాలన నుండి విముక్తి పొందాక స్వాతంత్య్రపు శతాబ్ది ఉత్సవాల సంవత్సరం 2047 నాటికి మన దేశపరిస్థితి ఎలా ఉంటుంది? సామాజిక సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దీర్ఘకాలిక స్వయంసేవక్ , పూర్తికాలపు RSS ప్రచారక్ (లక్ష్యంతో స్ఫూర్తి పొందినటువంటి వ్యక్తి)గా, సభ్యత్వంలో, యూనివర్సిటీ శాఖల పరంగా ప్రపంచంలోనే అతి పెద్దదయినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) తో పనిచేస్తున్న వాడిగా, నాలో ఉత్పన్నమైన ప్రశ్న ఏమిటంటే - ఆనాటికి RSS ఉనికికి ప్రయోజనం ఏమయినా ఉంటుందా?

ప్రపంచానికంతటికి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, మార్గదర్శనం చేస్తూ భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తుందని, "సంఘం” సమాజాన్నుండి విడదీయరానిదిగా మారుతుందని సంఘ పెద్దలతో నేను చర్చించినపుడు నాకు లభించిన సమాధానం. సంఘం - భారత సమాజంలో పాలలో పంచదారలా కలిసిపోయి ఉంటుందని, అలాగే పంచదార కలిసిన తర్వాత పాలు ఎలాగైతే పంచదార మాధుర్య లక్షణాలనే ప్రదర్శిస్తాయో, భారత సమాజం కూడా సంఘం యొక్క లక్షణాలనే ప్రదర్శించడం మొదలు పెడుతుంది. కాబట్టి, సంఘం సమాజానికి సహవ్యాపకంగా మారుతుంది. అంతటితో సంఘం ఒక ప్రత్యేక సంస్థగా ఉండాల్సిన అవసరం తీరిపోతుంది.

సంఘ్ సమాజ్ బనేగా

సంఘం ఎన్నడూ కూడా సమాజాన్ని శాసించే ఒక ప్రత్యేకశక్తిగా ఉండాలనుకోలేదు. సమాజాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నది. తద్వారా సమాజం తన సమస్యలను తానే పరిష్కరించుకోగలుగుతుంది. తమకంటూ ప్రత్యేక స్థానాన్ని వదిలేస్తూ ఎలాగైతే నదులన్నీ సముద్రంలో కలిసిపోతాయో, అలాగే సంఘం - సమాజంలో మిళితమైపోవటమే పరమోత్కృష్టమైన లక్ష్యం. ఈ స్ఫూర్తిని గుర్తుచేస్తూండటం కోసమే సంఘంలో "సంఘ్ సమాజ్ బనేగా" (సంఘమే సమాజమవుతుంది) అని పదే పదే నినదిస్తూ ఉంటారు........

  • Title :RSS Pranalika 21va Shatabdam Kosam
  • Author :Sunil Ambekar
  • Publisher :Emesco Books pvt.L.td.
  • ISBN :MANIMN4040
  • Binding :Papar back
  • Published Date :Dec, 2022
  • Number Of Pages :246
  • Language :Telugu
  • Availability :instock