• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Rudra Bhashya Prasangamulu 1st part

Rudra Bhashya Prasangamulu 1st part By Sadguru Dr K Sivanandamurty

₹ 250

మొదటి ప్రసంగము

27-11-2006

రుద్రాధ్యాయము మీద ఉపన్యాసములు చెప్పమని కొందరు అడుగుతూనే ఉన్నారు. అయితే ఇంతవరకు నేను సాహసించలేదు. ఇప్పుడు అంత సాహసము వచ్చిందా అంటే ఇప్పుడూ లేదు. ఎందుకంటే, ఈ రుద్రాధ్యాయము మూడు వేదముల యొక్క మధ్య బిందువు, కేంద్ర స్థానమందున్నది. దీని చుట్టూ మూడు వేదములు వ్యాపించి ఉన్నవి, అని ఒక మాట చెప్పుతూ ఉంటారు. అంటే అర్థమేమిటంటే, ఏ తత్త్వమును గురించి రుద్రము చెప్పుతున్నదో, దాని చుట్టూ సృష్టి అంతా పరివేష్ఠించి ఉన్నది అని అర్ధము. రుద్రము మాత్రము కేంద్రములో ఉన్నదని కాదు. భాష కాదు, వాక్యము కాదు. రుద్రాధ్యాయము చెప్పుతున్నటువంటి తత్త్వమేదైతే ఉన్నదో, దానిని ముల్లోకములు పరివేష్టించి ఉన్నవని అర్ధము. సృష్టి అంతా వేదమే కాబట్టి దానిలో ఇది కేంద్రమందు ఉన్నది. అంటే ఇది ఒక బిందువు. పూర్వలోకముల యొక్క స్మృతి, సృష్టి యొక్క ప్రారంభము, దానిలో మనుష్యులు దేవతలు రాక్షసులు మళ్ళీ పుట్టటము, చతుర్దశ భువనములు, అనేకకోటి బ్రహ్మాండములు, ఇవన్నీ కూడా ఒక తత్త్వములోనుండి పుట్టి, తత్త్వములో లీనము అవుతున్నవి కానీ, ఒక వస్తువులో నుండి పుట్టి వస్తువులో జీర్ణించడము లేదు. ఆ తత్త్వమేదో రుద్రము చెప్పుతున్నది.

అన్ని ఉపనిషత్తులు మోక్షవిద్యను చెప్పుతున్నవని అంటారు కదా! మోక్షవిద్యను చెప్పడమంటే ఏమిటి? గుణములకు అతీతమై, రూపములకు అతీతమై, నామ గుణ రూపములకు ఉత్పత్తి స్థానమై, లయస్థానమై ఉన్నటువంటి సత్యవస్తువు ఏదైతే ఉన్నదో, దానిని గురించి వినడమే మోక్షవిద్య. గుణరూపములుంటే మనుష్యులకు ధ్యానించడానికి వీలవుతుంది. మనిషి ధ్యానించడానికి సాధ్యము కాని వస్తువు నిర్గుణమై ఉంటే అది ఎందుకు? వినడమే! అందువలన దానిని గురించిన ఆలోచనలు, మనిషికి తనయొక్క సంస్కారమును బట్టి వైవిధ్యముతో సద్గురు...........

  • Title :Rudra Bhashya Prasangamulu 1st part
  • Author :Sadguru Dr K Sivanandamurty
  • Publisher :Sivananda Supadha Foundation
  • ISBN :MANIMN5436
  • Published Date :July, 2023
  • Number Of Pages :304
  • Language :Telugu
  • Availability :instock