• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Rudra Bhashya Prasangamulu 2nd part

Rudra Bhashya Prasangamulu 2nd part By Sadguru Dr K Sivanandamurty

₹ 250

మొదటి ప్రసంగము
 

27-11-2008

రుద్రమునకు ఎన్నో భాష్యములు ఉండగా మళ్ళీ మనము ఎందుకు చెప్పుకోవాలి? భాష్యములన్నీ, ఎవరి అవగాహనలో వారు చెప్పుతున్నారు. భాష్యమును వ్రాయనే వ్రాసినారు. రుద్రము అని ఒక అధ్యాయము యజుర్వేదములో మధ్యన ఉన్నదని, దాని ఉత్కృష్టత చెప్పటానికి ఇలా ఏవో మనకు చెప్పుతారు. అది రుద్రుని స్తుతి చేస్తున్నది. పదునొకండు అనువాకములు కలిగి ఉన్నది. ఆ రుద్రము అంతా పారాయణ చేసిన తరువాత, ఆ పదునొకండు అనువాకముల తరువాత చమకము అనేది ఒకటి ఉన్నది. ఆ చమకములో అన్నీ 'చ' కారములతో ఉండడముచేత 'నాకు ఇది కలుగును గాక', 'అది కలుగును గాక' అని అంటూ మధ్యన ఏమన్నారంటే 'శం' అంటే శుభము 'చ' నాకు కలుగును గాక అన్నారు. ఈ చకారము ఏమిటంటే ఒకటి కాదు, అనేకము. 'చ' అంటే నూరు అనుకొనండి. 'శ్రీశ్చ' ''హ్రీశ్చ' అని అలాగ, అంటే మనిషికి పనికి వచ్చేవి ఎన్నో ఆపదలు రాకూడదు, శుభకరమైన ఫలములు రావాలి. ఇవి రుద్రునికి అభిషేకము చేసి ఎందుకు సంపాదించాలి? దానితో ఏమి నిమిత్తము? అలా లేకుండా కూడా సంపాదించుకోవచ్చు. కాని మనుష్యుడు ఏది కోరుకుంటాడో దానికి కావలసిన పని చేయడు. ఏది చూచి భయపడుతాడో అది ఇష్టపడి పనిచేస్తాడు. పాపము చేసి పాపఫలము అనుభవిస్తాడు. పుణ్యఫలము కోరుకుంటాడు కాని పుణ్యము చేయడు, కాబట్టి తన కర్మకు అతీతమైన శక్తిని ఆశ్రయిస్తే మన కర్మలో ఉండే లోపములను సరిదిద్ది కావలసినవి యిచ్చి, వద్దన్నవి మానిపించే శక్తి అతనిలో ఉన్నది. దీనివల్ల తన కర్మను జయిస్తున్నాడు. కర్మలు జయించడము అంటే తాను జయించడము కాదు. ఈశ్వరుని అనుగ్రహము చేత అతనిని ఆశ్రయించి తన కర్మలను తాను జయించవలె అని ఇందులో బోధ ఉన్నది. ఈ ప్రార్ధనలో నీవు అనుభవిస్తున్న కర్మల బాధలు పడకుండా కోరికలు సద్గురు............

  • Title :Rudra Bhashya Prasangamulu 2nd part
  • Author :Sadguru Dr K Sivanandamurty
  • Publisher :Sivananda Supadha Foundation
  • ISBN :MANIMN5437
  • Binding :Papar Back
  • Published Date :Sep, 2023
  • Number Of Pages :272
  • Language :Telugu
  • Availability :instock