• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Rudramadevi

Rudramadevi By Nori Narasimha Sastry

₹ 300

"జయతి భగవాన్ స్వయంభూః గణపతినృపతేర్హృది స్థిత స్సతతమ్,

యాత్కారుణ్యకటాక్షైః వృద్ధిం ప్రాప్తాంధ్రదేశశ్రీః"

అది మహాలయామావాస్య!

మల్కాపురశాసనమ్

ఆకాశము మేఘావృతమై యున్నది. సూర్యోదయమైనను భగవానుడు కను పడియు కనుపడకుండ నున్నాడు. వీరోత్సవములతో పొంగిపొరలుచుండు నేక శిలానగర మానాడు వర్షపాతమునకు బూర్వము గగనాంగనవలె పూర్ణగర్భిణియై యించుక మాంద్యము వహించియున్నది.

రాచనగరులో మంగళతూర్యపంచకము అనుదినము ప్రాతస్సమయముల మ్రోయుచునే యున్నవి. కాని యిప్పటికి నెలనాళ్లనుండియు నవి యెప్పటివలె దీర్ఘకాలము శ్రవణపర్వము చేయక, ప్రారంభించిన యల్పకాలమునకే సమాప్తి నొందుచు, ప్రవర్తింపని రాగస్వరమువలెను, విస్తరింపని వర్ణనవలెను, సవరింపని కావ్యమువలెను, వివరింపని కథావస్తువువలెను ఆనందదాయకములుగా లేవు. పై పెచ్చు అనిర్వాచ్యమగు నశాంతిని భయమును, వినువారి కావేశింపజేయు చుండెను.

మహారాజు జనమందరికి నిత్యము దర్శనమిచ్చు నియమితవేళ ప్రాతః కాలమున గలదు. అంతకుముందుగానే పురజనులు రాజద్వార సమీపమున మూగుచు నిశ్శబ్దముగా తమ చూపులు రాజమందిరాట్టాలకమందలి గవాక్షముపై వ్యగ్రతతో నిలుపుచుండిరి. ఆ ప్రదేశములనుండి మహారాజు దర్శన మొసంగును. కాని యీ నెలరోజులనుండియు నా యట్టాలకమునుండి కాని గవాక్షమునుండి గాని ప్రజలకు మంగళప్రదమగు రాజదర్శన మగుటలేదు. అందుకు మారు రాజదూతయొక డట్టాలకముపై ప్రత్యక్షమై దీర్ఘగంభీరస్వరముతో నిట్లు ప్రకటించుచుండెను...............

  • Title :Rudramadevi
  • Author :Nori Narasimha Sastry
  • Publisher :Emesco Books pvt.L.td.
  • ISBN :MANIMN5429
  • Binding :Papar Back
  • Published Date :April, 2024
  • Number Of Pages :424
  • Language :Telugu
  • Availability :instock