ప్రవేశిక
- వష్ణ జగర్నాథ్
ఆంటోనియో గ్రాంసీ, క్లాడియా జోన్స్, ఫ్రాంజ్ ఫానన్, కారల్ మార్క్స్ ఇంకా అనేక మంది మాదిరిగానే రూత్ ఫస్ట్ కూడా తన జీవిత కాల పోరాటంలో అనేకానేక పాత్రలు నిర్వహించారు. కమ్యూనిస్టు మిలిటెంట్ గా, జర్నలిస్టుగా, గొప్ప మేధావిగా... ఒకే సారి అనేక కర్తవ్యాలు నిర్వహించారు. ఆమె దక్షిణాఫ్రికా పాత్రికేయ చరిత్రలో సోల్ ప్లాట్టె, గోవన్ ఎంబెకి వంటి వారి సరసన ఒక గౌరవప్రదమైన స్థానం సంపాదించారు. ఒకనాడు దక్షిణాఫ్రికాలో రూత్ ఫస్ట్, ఎంబెకి, ప్లాస్టీ వంటివారు నిర్వహించిన పాత్రను నేడు ఆ దేశంలో నడుస్తున్న పాత్రికేయ వృత్తితో పోలిస్తే ఎంతో వెలితి కనిపిస్తుంది. మేధో చర్చ విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. నాడు విముక్తి పోరాట కాలంలో మేధావులు చేసిన కృషితో పోలిస్తే కూడా నేడు మన రాజకీయ జీవితంలో జరుగుతున్న మేధో చర్చల మధ్య అంతే తేడా కనిపిస్తుంది. అదే కాకుండా ఈనాడు అకాడమీ లోపలా, బయటా కూడా చాలా తక్కువ మంది మేధావులు మాత్రమే సామాజిక ఉద్యమాల్లోనూ, ట్రేడ్ యూనియన్లలోనూ పాల్గొంటున్నారు. నిజమైన రాడికల్ మేధావులు నిరంతరం బాధాకరమైన మార్గంలోనే పయనించాల్సి వస్తుంది. వారు తరచూ దుష్ప్రచారాన్ని ఎదుర్కొంటారు. వారిని వృత్తి రీత్యా వంటరి పాటు చేస్తారు. చివరికి ప్రావాస జీవితం, జైలు జీవితాన్ని ఎదుర్కొంటారు, హత్య కూడా గావించబడతారు. రూత్ ఫస్ట్కు ఇదంతా బాగా తెలుసు. ప్రారంభంలో ఆమె ఇతర మిలిటెంట్ల అనుభవాల నుండి ఈ విషయాలు తెలుసుకున్నారు. స్టీవ్ బికీ న 1977 సెప్టెంబర్లో హత్య చేశారు. 1978 జనవరిలో రిచర్డ్ టర్నర్ను హత్య చేశారు. నాలుగేళ్ల తరువాత 1982 ఆగస్టు 17న ఆమె జీవితం కూడా ఇదే విధంగా అంతమైంది. తనకు మొపుటోలోని యూనివర్శిటీకి రూత్ ఫస్ట్ ఏరిన రచనలు..................